Bathukamma celebrations at Minister Jagdish Reddy’s house
మంత్రి జగదీష్ రెడ్డి ఇంట బతుకమ్మ సంబరాలు
పూల పండుగ తో పులకిస్తున్న సూర్యాపేట
క్యాంపు కార్యాలయం లో తోటి మహిళ లతో కలిసి బతుకమ్మ పేర్చిన మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి , ఎస్ ఫౌండేషన్ చైర్మన్ సునీతా జగదీష్ రెడ్డి
టీ.ఆర్.ఎస్ హయం లో నే మహిళలకు అధిక ప్రాధాన్యత
2014 కు ముందు బతుకమ్మ ఆడటానికి కోర్టుకు వెళ్ళిన రోజులు ఉండేవి
*సాక్షిత సూర్యాపేట : *
బతుకమ్మ పండుగను అధికారంగా జరుపుకోవడం, బతుకమ్మ చీరలు ఇవ్వడం, తంగేడు రాష్ట్ర పువ్వు కావడం లాంటివన్నీ తెలంగాణ ఆడబిడ్డలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సతీమణి ,ఈజ్ ఫౌండేషన్ చైర్మన్ సునీత జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
ఒకప్పుడు బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి కోర్టుకు వెళ్లిన విషయాన్ని సునీత జగదీష్ రెడ్డి గుర్తుచేశారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వమే ఘనంగా బతుకమ్మను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్స్, షాదీ ముభారక్, అమ్మవడి వంటి పథకాలు మహిళ కోసమే కేసీఆర్ ప్రవేశ పెట్టారని తెలిపారు.
. ఈ పథకాలే మహిళకంటే కేసీఆర్ గారికి ఉన్న గౌరవానికి నిదర్శనం అన్నారు… మహిళా టీ. ఆర్. ఎస్ నేతలు అంతా క్యాంపు ఆఫీసు కు తరలి రావడం తో క్యాంపు ఆఫీసు లో సందడి నెలకొంది.. ఆడ పడుచులతో కలిసి బతుకమ్మ పేర్చి న మంత్రి ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ , దసరా శుభాకాంక్షలు తెలిపారు..
కార్యక్రమం లో మహిళా ప్రజాప్రతినిధులు, ఆడబిడ్డలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అంతకుముందు తెలంగాణ ఆడబిడ్డలందరికీ సునీత జగదీష్ రెడ్డి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.’పూల పండుగతో తెలంగాణ పులకించిందన్న సునీత జగదీష్ రెడ్డి ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగిందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. తెలిపారు. తొమ్మిది రోజులుగా సూర్యాపేట ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవడం సంతోషం దాయకమన్నారు. బతుకమ్మ స్ఫూర్తితో ప్రకృతిని, పచ్చదనాన్ని, నీటి వనరులను కాపాడుకోవాలని ప్రజలను కోరారు.