బలిజ భవనం నాకు దేవాలయంతో సమానం, మీ పిల్లల భవిష్యత్తు

Spread the love

బలిజ భవనం నాకు దేవాలయంతో సమానం, మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేయండి, మీకు అన్ని రకాల సహాయ సహకారాలు నేను అందిస్తాను – MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి

  • పండుగల శ్రీకాళహస్తిలో బలిజ భవనం భూమి పూజా కార్యక్రమం

శ్రీకాళహస్తి వంగవీటి మోహన్ రంగా కాలనీ లో శ్రీకృష్ణదేవరాయల బలిజ భవన్ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు బలిజ కుటుంబీకుల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

శ్రీకృష్ణదేవరాయ బలిజ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బియ్యపు  మధుసూదన్ రెడ్డి ,దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు బలిజ సోదరులందరూ కలిసి సంయుక్తంగా భూమి పూజ నిర్వహించారు.

ముందుగా ఎమ్మెల్యే కి బలిజ సంక్షేమ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం సాంప్రదాయ పద్ధతిలో కలశ పూజలు జరిపి భూమి పూజ ను శాస్త్ర యుక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ మాట్లాడుతూ, కాపు బలిజ సంక్షేమ అభివృద్ధికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు అందిస్తున్న సహకారం మరువలేనిది అన్నారు. బలిజ కులస్తుల్లో నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయని అందరికోసం కమ్యూనిటీ భవనాలు కళ్యాణ మండపం విద్యార్థుల కోసం వసతిగృహాలు నిర్మాణం చేసుకొని బలిజ కులస్తులందరూ వినియోగించుకునే విధంగా అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఆరు నెలల లోపు భవన నిర్మాణాన్ని పూర్తిచేసి తిరిగి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చే  ప్రారంభోత్సవం చేస్తామన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాపు బలిజ సంక్షేమ సంఘం మంచి కమిటీ ఏర్పాటు చేసుకొని భవన నిర్మాణం చేపట్టడం అభినందినీయమన్నారు. ఇది ఒక జాతి దేవాలయం లాంటిదని తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తానే మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి భవనాన్ని ప్రారంభించి బలిజ కుటుంబాలతో నా కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి భోజనం చేస్తానన్నారు.శ్రీకాళహస్తి లో అనేక సత్రాలు ఉండేటివి అని ఆ సత్రాలకు సంబంధించిన రికార్డులు గత పాలకుల హయాంలో మాయం అయ్యాయని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. తాను గతంలో దేవుడికి పూలు సరఫరా చేసిన పూల తోట ని దేవస్థానం పరం చేయాలని చూస్తే రికార్డు లేవు అని భూములకు ఆస్తులకు రికార్డులు లేవని గత పాలకుల చిత్తశుద్ధి లేని మూలంగా దేవుడు ఆస్తులు అన్యక్రాంతమయ్యాయి అన్నారు. బలిజ సోదరులు ఒక యూనిట్ గా ఉండి భవన నిర్మాణం చేసుకొని ప్రతి ఒక్కరూ వినియోగించుకునే విధంగా ముందుకు సాగాలన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే అందరికీ మంచి జరుగుతుందని మనకు ఎవరు మంచి చేస్తున్నారో ఆలోచించాలన్నారు.

ఈ కార్యక్రమంలో బలిజ సంక్షేమ సంఘం నాయకులు మాజీ దేవస్థానం చైర్మన్ కోలా ఆనంద్, రిటైర్డ్ జడ్జి రాధాకృష్ణ, ఉప్పు కృష్ణయ్య, పూల కృష్ణమూర్తి, స్వర్ణ మూర్తి, గాజుల సత్యం, చిలక గోపి, రామకృష్ణ, మున్నా రాయల్,బుల్లేట్ జయశ్యామ్, కోళ్ల గోవర్ధన్, చిలకా రంగయ్య, మందల బాలాజీ, అంజూరు రాజశేఖర్, తీగల భాను, పసుపులేటి కోదండం, వల్లం గోపి, పేట జనార్ధన్, చంద్రమౌళి, రాఘవులు, అంజూరు రమణ, కండ్రిక రమణ, కంట ఉదయ్ కుమార్, చింతామణి పాండు, పగడాల రాజు, సెన్నీర్ కుప్పం శేఖర్, ఒకవేళ ప్రతాప్, సిద్దుల మురళి, డివి నారాయణ, సుకుమార్, కోలా వెంకటేశ్వరరావు, ముత్యాల కృష్ణ, లీల ప్రసాద్, జలకం కిషోర్, కనపర్తి తిరుపాల్, చక్రాల మురళి, పసుపులేటి శ్రీను, పగడాల సుధాకర్,కంట వెంకటేశ్వర్లు, పత్తి మనీ, గరికిపాటి చంద్ర, బాలిశెట్టి నరసింహులు, కొట్టే సత్యనారాయణ, గంగాధర్, పూడి రవి, చింతామణి యానాది, మరియు స్థానిక బలిజ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page