సిక్కులు ఎంతో గొప్పగా జరుపుకొనే పండుగ బైసాఖీ ఉత్సవం అని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖల్సా స్థాపించిన రోజును పురస్కరించుకొని అమీర్ పేట లోని DK రోడ్డులో గల MCH గ్రౌండ్ లో సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో 325 బైసాఖీ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సికింద్రాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్ధి పద్మారావు గౌడ్, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ లు హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన అనంతరం వారిని గురుద్వార్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సిక్కు సమాజ్ కు బైసాఖీ ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం బైసాఖీ సందర్బంగా గురుద్వార్ లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించడం, భారీ ఊరేగింపులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. బైసాఖీ ఉత్సవం సందర్బంగా అందరు ఒక చోటకు చేరి ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గురుద్వార్ అద్యక్షులు దర్శన్ సింగ్, జనరల్ సెక్రెటరీ సురేందర్ సింగ్, సభ్యులు సుమిత్ సింగ్, టిల్లు బాయ్, సురేందర్ సింగ్, BRS నాయకులు కూతురు నర్సింహ, ప్రవీణ్ రెడ్డి, బలరాం తదితరులు పాల్గొన్నారు.
సిక్కులు ఎంతో గొప్పగా జరుపుకొనే పండుగ బైసాఖీ ఉత్సవం అని మాజీమంత్రి,
Related Posts
శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం
SAKSHITHA NEWS శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం తలపించిన శ్రీ చైతన్య ఎలక్షన్ సందడిసాక్షిత ధర్మపురి ప్రతినిధి:-జగిత్యాల/వెల్గటూర్: డిసెంబర్ 20 జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు ఎలక్షన్ నిర్వహించి అబ్బాయిల నుండి…
బీర్పూర్ లో సంచలనo సృస్టించిన దోపిడి కి సంబందించిన కేసులో 6 గురు నిందితులను అరెస్ట్
SAKSHITHA NEWS బీర్పూర్ లో సంచలనo సృస్టించిన దోపిడి కి సంబందించిన కేసులో 6 గురు నిందితులను అరెస్ట్ దర్యాప్తు లో బాగంగా జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ ఆదేశానుసారం , జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ ఆధ్వర్యం…