SAKSHITHA NEWS

Background of previous by-election

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో చండూర్ మండల తెరాస పార్టీ పరిశీలకుడిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా ఈ రోజు చండూరు మండలం లోని దోనిపాముల గ్రామం ఇంచార్జ్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ , కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి తో కలిసి మునుగోడు ఉప ఎన్నికలో తెరాస పార్టీ బలపర్చిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వారి విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలలో భాగంగా చండూర్ మండల ఎన్నికల పరిశీలకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు విధులు నిర్వహించడం జరుగుతుంది అని ,ఈ అవకాశం కలిపించినదుకు కృతఙ్ఞతలు తెలుపుతున్నాను అని, ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు

మునుగోడు ఉప ఎన్నికలో తెరాస పార్టీ బలపర్చిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే తెరాస పార్టీ కి శ్రీరామ రక్ష అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా నల్గొండ జిల్లాలో ప్లోరైడ్ భూతాన్ని మిషన్ భగీరథ ద్వారా తరిమికొట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎనిమిది ఏండ్లలో చేసిన అభివృద్ధి ,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం అని ప్రభాకర్ రెడ్డి విజయం ను ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, తెరాస నాయకులు జనార్దన్ రెడ్డి, అక్బర్ ఖాన్, కార్తిక్ గౌడ్,కొండల్ రెడ్డి, అంజద్ ,ఆఫసర్ మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS