నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి 19వ డివిజన్ పరిధిలో అత్యాధునికంగా నిర్మితమైన *బాచుపల్లి పోలీస్ స్టేషన్ నూతన భవనం* ప్రారంభోత్సవ కార్యక్రమంలో *రాష్ట్ర హోం,జైళ్లు,అగ్నిమాపక సేవలు శాఖా మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ,రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ,కర్మాగారముల,నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి చామకూర మల్లారెడ్డి , ఎమ్మెల్సీలు సురభి వాణి దేవి , నవీన్ రావు , ప్రభుత్వ విప్,మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు,ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు , కుత్బుల్లాపూర్ శాసనసభ సభ్యులు కేపీ వివేకానంద ముఖ్య అతిధులుగా,మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,ఇంఛార్జి కమిషనర్ రామకృష్ణారావు ,స్థానిక కార్పొరేటర్ కాసాని సుధాకర్ ముదిరాజ్ ,NMC కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించడం జరిగింది*.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీస్ ముందు స్థాయిలో ఉందని,ముఖ్య మంత్రి కెసిఆర్ కృషి తో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖా నడుం బిగించిందని పేర్కొన్నారు.రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టినట్టు తెలిపారు.పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలను అందించాలని కోరారు.