వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలులో డీసీసీబీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన FSCS మార్ట్

Spread the love

వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలులో డీసీసీబీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన FSCS మార్ట్, గోదాం లను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి


సాక్షిత : హాజరైన టెప్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు, స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డీసీసీబీ చైర్మెన్ మార్నేని రవీందర్ రావు తదితరులు
వర్ధన్నపేట నియోజకవర్గం, నందనం FSCS పరిధిలో ఐనవోలు మండల కేంద్రంలో FSCS మార్ట్, 1000 MT గోదాంలను టెప్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు, స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డీసీసీబీ చైర్మెన్ మార్నేని రవీందర్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు.
డీసీసీబీ ఆధ్వర్యంలో డి మార్ట్ తరహాలో FSCS మార్ట్ ప్రారంభించడం పట్ల శుభాకాంక్షలు!

ఐనవోలు ప్రజలకు ఈ మార్ట్ లో తక్కువ ధరల్లో వస్తువులు లభించేలా చర్యలు తీసుకోవడం అభినందనీయం!!
మార్ట్ ఏర్పాటుకు కృషి చేసిన నందనం FSCS అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ను అభినందిస్తున్నాను
గతంలో డీసీసీబీ ఎలా వుంది? ఇప్పుడు ఎలా ఉంది? సమీక్షించుకోవాలి
గతంలో ఇన్ని నిధులు, ఇంత రుణాలు, ఇంత రికవరీ ఉందా?
సీఎం కెసిఆర్ దయ వల్ల ఇవ్వాళ రైతు అత్యంత సంతోషంగా ఉన్నాడు
గతంలో రైతులు తీవ్ర ఆందోళనతో అయోమయంలో ఆవేదనతో ఉండేవాడు.
కానీ ఇవ్వాళ సీఎం కెసిఆర్ సీఎం అయ్యాక కరెంటు, నీళ్ళు వస్తున్నాయి.


ఎదురు పెట్టుబడి ఇచ్చిన మహానుభావుడు సీఎం కెసిఆర్
సీఎం కెసిఆర్ ఒకవైపు రైతులకు మేలు చేస్తుంటే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కీడు చేస్తున్నది
రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం కుట్ర పన్నుతున్నది
దేశ వ్యాప్త రైతుల కోసం ఉద్యమించిన 7వేల మంది రైతులకు పొట్టన పెట్టుకున్న, కాల్చి చంపిన ప్రభుత్వం బీజేపీ ది
రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనిద్దమా?
ప్రజలు.ఆలోచించాలి. సీఎం కెసిఆర్ రైతుల కోసం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం ను చూడండి
కాళేశ్వరం ద్వారా వద్దంటే నీరు ఇస్తున్న, 24 గంటల కరెంట్ ఇస్తున్న, రైతు బంధు, రైతు బీమా… ఇలా దేశంలో ఎవరైనా ఇస్తున్నారా?


కెసిఆర్ దయ వల్ల ఇవ్వాళ రాష్ట్రం సస్యశ్యామలం అయింది
భూగర్భ జలాలు పెరిగాయి
మోడీ హైదరాబాద్ వేదికగా 200 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. 1250 కి పెంచారు
పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచిన ప్రజా వ్యతిరేక ప్రభుత్వం బీజేపీది
ప్రజలను, రైతులను మోసం చేస్తున్న బీజేపీ ని ప్రజలు తరిమి తరిమి కొట్టాలి
అన్ని రకాల రుణాలు ఇస్తూ రైతులను మాత్రమే గాక, అన్ని రంగాల ప్రజలకు డీసీసీబీ మేలు చేస్తున్నది
డీసీసీబీ ని, నందనం pacs ని అభినందిస్తున్నాను
ప్రజలు డీసీసీబీ ని కాపాడుకోవాలి
ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, ఖమ్మం జిల్లా డిసిసిబి చైర్మన్ నాగ భూషణం, జిల్లా రైతు బందు అధ్యక్షురాలు లలితా యాదవ్, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, బ్యాంక్ అధికారులు, నందనం సొసైటీ డైరెక్టర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page