ఎగ్జామ్ ప్యాడ్ లపై- ఎమర్జెన్సీ నెంబర్ల అవగాహన

Spread the love

ఎగ్జామ్ ప్యాడ్ లపై- ఎమర్జెన్సీ నెంబర్ల అవగాహన

ఎస్ఐ శేఖర్ రెడ్డి వినూత్న ఆలోచన

ప్రశంసల జల్లు కురిపిస్తున్న ప్రజానీకం

మండల కేంద్రంలోని వీణవంక హైస్కూల్లో సోమవారం ఎస్సై శేఖర్ రెడ్డి పోలీసులు – మీకోసం. …. కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లైన డయల్ 100,181,1098,1930 ముద్రించిన పరీక్ష ప్యాడ్ లతో పాటు, వాటర్ బాటిల్స్, పెన్నులను అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ…
ఎలాంటి ఎమర్జెన్సీ సమయంలోనైనా డయల్ 100 కు కాల్ చేసినట్లయితే,తక్షిణ పోలీస్ సహాయం పొందవచ్చన్నారు.

పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, వేధింపులకు గురిచేసిన, వీధి పిల్లలను, బాల కార్మికులను, పిల్లలు అక్రమ రవాణాకు గురైన పిల్లలు, తప్పిపోయిన పిల్లలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి గురైన పిల్లలు, బాల్యవివాహాలు నిలుపుదలకై 1098 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలన్నారు.

సైబర్ మార్గాల ద్వారా ఆర్థిక మోసాలకు గురైన వారు 1930 టోల్ ఫ్రీ నెంబర్ వెంటనే కాల్ చేస్తే కోల్పోయిన సొమ్మును తిరిగి స్వాధీనం చేసుకోవచ్చన్నారు. 1930 ద్వారా సైబర్ మోసాల నిరోధించడంతోపాటు, సైబర్ మోసగాళ్లను గుర్తించవచ్చన్నారు.

గృహహింస, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, పనిచేసే చోట వేధింపులు ఎదుర్కొనే మహిళలు 181 మహిళ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయాలన్నారు. తద్వారా బాధితులకు తక్షణ సహాయం క్రింద రక్షణతో పాటుగా కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అందించబడుతుందన్నారు.

విద్యార్థులు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ల పట్ల అవగాహన కలిగి, ప్రతికూల పరిస్థితులలో అప్రమత్తంగా వ్యవహరించి, పోలీసుల సహాయంతో ప్రమాదం నుంచి రక్షణ పొందాలన్నారు.మండలం లోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు కు ప్యాడ్స్, వాటర్ బాటిల్స్ మరియు పెన్నులు ఇవ్వడం జరిగింది.
కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పులి అశోక్ రెడ్డి, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page