Assistant Executive Engineer exam ended peacefully
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది
-జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్
సాషిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆదివారం నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఆదివారం కలెక్టర్ స్థానిక ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్, రెజోనెన్స్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో కల్పించిన మౌళిక వసతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పరీక్ష నిర్వహణకు 19 కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు, పరీక్షలకు 6,664 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. పరీక్ష ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్ లో జరిగినట్లు, ఉదయం సెషన్ కి 5,194 మంది (77.94%) హాజరుకాగా, మధ్యాహ్నం సెషన్ కి 5166 మంది (77.52%) మంది హాజరయ్యారని ఆయన తెలిపారు. కలెక్టర్ తనిఖీల సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, చీఫ్ సూపరింటెండెంట్లు రమేష్, ప్రసన్న రావు, లైజనింగ్ అధికారులు శ్రీనివాసరావు, రవిబాబు, సహాయ లైజనింగ్ అధికారులు కరుణ, కృష్ణ తదితరులు ఉన్నారు.