SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 03 at 3.27.41 PM

ఎమ్మెల్యే సాయన్న మృతికి అసెంబ్లీలో సంతాపం.. ఆయన లేని లోటు తీర్చలేనిదన్న సీఎం కేసీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన అనంతరం అసెంబ్లీ దివంగత కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించింది

అనంతరం సభలో సీఎం కేసీఆర్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసన సభ్యుడిగా, ఇతర అనేక హోదాల్లో పని చేశారన్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన అనంతరం అసెంబ్లీ దివంగత కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించింది. అనంతరం సభలో సీఎం కేసీఆర్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసన సభ్యుడిగా, ఇతర అనేక హోదాల్లో పని చేశారన్నారు. ఆయన వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందన్నారు.

ఎటువంటి సందర్భంలోనైనా చిరునవ్వుతో చాలా ఓపికతో ఉండేవారని, అందరితో కలుపుగోలుగా ఉండేవారని సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారన్నారు. సాయన్న కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాను ముఖ్యమంత్రిని అయ్యాక.. అనేక సందర్భాల్లో ఏదైనా ప్రయత్నం చేసి హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ను కలిపేందుకు ఎనలేని కృషి చేశారన్నారు. కంటోన్మెంట్‌ ప్రజలకు చాలా తపనపడేవారన్నారు. అనేక సందర్భాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాం.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి కంటోన్మెంట్లను నగరపాలికల్లో కలపాలని ఆలోచిస్తుందన్న శుభవార్త అందింది. ఆ రకంగానైనా సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానన్నారు. సాయన్న నిజామాబాద్‌ జిల్లాలో జన్మించారని, హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీలో సెటిలై.. వ్యాపారవేత్తగా ఉన్నారన్నారు. ఆయన వివాదరహిత నేతల్లో ఆయన ఒకరని, ఆయన కూతురు సైతం నగరంలో కార్పొరేటర్‌గా సేవలందించిందన్నారు. సాయన్న కుటుంబం తమ కుటుంబంలాంటిదన్నారు. ఆయన లేని లోటు తీరనిదని, కుటుంబానికి అండగా ఉంటామన్నారు.


SAKSHITHA NEWS