మేడారం మహాజాతర మొదటిరోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది.
కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు.
పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీర్చారు.
ఆ సమయంలో జాతర ప్రాంగణంలోని విద్యుత్తు దీపాలన్నీ ఆర్పేసి ఆకాశం నుంచి వెన్నెల వెలుగులు ప్రసరిస్తుండగా అర్ధరాత్రి 12.20తర్వాత గద్దెలపై ప్రతిష్ఠించారు..