రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం

Spread the love

రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు. ..


సాక్షిత *: నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ పార్లమెం టులో మహిళా మీటింగ్ ద రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించు కొని కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేయాలని మహిళా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు పార్లమెంటు రివ్యూ మీటింగ్ మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిగా హాజరైనారు , ఈ కార్యక్రమాని కి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు మందాడి రోహిని అధ్యక్షత వహించగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని సునీత రావు అన్నారు , కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో అవకాశం కల్పిస్తున్నామని గొప్పలు చెబుతూ నిరంతరం మహిళలపై వేధింపులు జరుగుతున్నా గతంలో పట్టించు కోని బి ఆర్ఎస్ ,బిజెపి కి బుద్ధి చెప్పాలని యుద్ధ ప్రాతిపదికన మహిళా సమావేశాలు నిర్వహించడం జరిగింది,

నిత్యవసర వస్తువులు సామాన్య ప్రజలు కొన లేని పరిస్థితిలో ఉన్నారని ప్రతి వస్తువు పైన జిఎస్టి వేసి ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని పత్రికా ముఖంగా తెలియజేయడం జరిగింది,సునీత రావు అన్నారు,జిల్లా కమిటీలు, బ్లాక్ అధ్యక్షులు, మండల కమిటీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు తమ కమిటీలను పూర్తిస్థాయిలో నియమించి క్షేత్రస్థాయిలో మహిళా కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు, తెలంగాణ రాష్ట్రంలోరేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి మహాలక్ష్మి పథకం ద్వారా6 గ్యారంటీ లతోపాటు మహిళల అభివృద్ధి కోసం పెద్దపీట వేసిందని అన్నారు, మహిళా మేనిఫెస్టో గురించి మహిళల అభిప్రాయాలను సేకరించి, రానున్న పార్లమెంటు ఎన్నికలలో మహిళలు అత్యధిక స్థానాలలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా సునీత రావు పార్టీ అధినాయకత్వాన్ని కోరారు,

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించే కార్పొరేషన్ నియమకాలలో మహిళా కాంగ్రెస్ ష్రెణులకు అధిక సంఖ్యలో కేటాయించాలని ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలుస్తామని తెలియజేశారు, , కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన1 నెల 15 రోజులలో 4 గ్యారెంటీ పథకాలను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ నెరవేర్చిందని సునీత రావు అన్నారు. బిఆర్ఎస్ వాళ్లు అధికారం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నారని సునీత రావు దుయ్యబట్టారు .ఈ కార్యక్రమం లో జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షురాలు నాగ శిరోమణి వనపర్తి జిల్లా అధ్యక్షురాలు శ్రీలత వైస్ ప్రెసిడెంట్ దుర్గారాణి. అధిత స్వప్న తో పాటు పార్లమెంటు పరిధిలోని ఆయా జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జిల్లా కమిటీల సభ్యురాల్లు, మండల అధ్యక్షురాల్లు, పట్టణ అధ్యక్షురాల్లు, వార్డు అధ్యక్షురాళ్లతోపాటు తదితరులు పెద్ద ఎత్తును మహిళలు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page