పాడి రైతులకు మినీ గోకులం షెడ్ల బిల్లుల బకాయిలు చెల్లించాలి

Spread the love

పాడి రైతులకు మినీ గోకులం షెడ్ల బిల్లుల బకాయిలు చెల్లించాలి..
పశు నష్ట పరిహారం బకాయిలు చెల్లించాలి..
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కు వినతి పత్రం..

ఏలూరు
పాడి రైతులకు మినీ గోకులం షెడ్ల బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.నెహ్రూ బాబుకు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. మినీ గోకుల షెడ్ల బిల్లులు బకాయిలు, పశు నష్ట పరిహారం పథకం బకాయిలు పాడి రైతులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలంటూ ఆందోళన నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా పాడి రైతులకు మినీ గోకులం షెడ్ల బిల్లుల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. అప్పులు చేసి పాడి పశువులకు షెడ్లు నిర్మాణం చేసుకున్న పాడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులకు వడ్డీలు పెరిగిపోయి పాడి పశువుల అమ్ముకొని అప్పులు తీర్చుకోవాల్సి దుస్థితి ఏర్పడిందని అన్నారు. మినీ గోకులం షెడ్ల బాధిత రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పాడి పశువులు మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పశు నష్ట పరిహారం పథకం నిధులు విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు.

పాడి పశువులు మరణించి నష్టపోయిన పాడి రైతులు పశు నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. జిల్లాలో పాడి రైతులు ఇవ్వాల్సిన పశు నష్టపరిహారం నిధులు రూ.8 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులను అన్ని విధాల ఆదుకోవాలని కోరారు.
వినతిపత్రం అందజేసిన అనంతరం పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.నెహ్రు బాబు మాట్లాడుతూ మినీ గోకులం షెడ్లు బిల్లుల బకాయిలు, పశు నష్టపరిహారం బకాయిల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తమ్మినీడి శ్రీనివాసరావు,టి.దొరబాబు పలువురు పాడి రైతులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page