- విచ్చలవిడిగా ఫ్లెక్సీలో ఏర్పాటు
నిషేధం ఉన్న నియంత్రణ కరువైన మున్సిపాలిటీ అధికారులు* - నాయకుల ఫ్లెక్సీలకు రుసుము లేకుండా కౌన్సిల్ తీర్మానం
*సాక్షిత వనపర్తి :
కొత్తసంవత్సరo, పండగలు పబ్బాలు వచ్చినప్పుడు పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపేందుకు అధికార పార్టీ ప్రతిపక్ష ఇతర పార్టీల రాజకీయ నాయకుల పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపేందుకు అలాగే రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు శంకుస్థాపన లు ప్రారంభోత్సవాలకు పట్టణానికి విచ్చేస్తున్న క్రమంలో సభలు సమావేశాలు నిర్వహించే సమయంలో పట్టణం ఈ చివరి నుండి ఆ చివరి వరకు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో తమ నాయకులకు ఫ్లెక్సీల ఏర్పాటు చేసి స్వాగతం పలుకుతూ ఉంటారు అలాగే ఎన్నికల సమయంలో అభ్యర్థుల ప్రచారం కోసం ఎన్నికల అనంతరం అభ్యర్థి గెలుపు సంబరాల కోసం ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుంటారు అయితే మున్సిపాలిటీ పరిధిలో రాజకీయ ప్రకటనలు కానీ వ్యాపార ప్రకటనలు కానీ ప్లెక్సీల ఏర్పాటు ద్వారా ప్రచారం చేసుకునే వారు మున్సిపాలిటీలో రుసుము చెల్లించి ఏర్పాటు చేసుకొని నిర్ణయిత కాలం మూడు రోజుల తర్వాత తొలగించాల్సి ఉంటుంది - ఒకవేళ మూడు రోజుల తర్వాత ఫ్లెక్సీలు అలాగే ఉంచితే రోజుకు వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించే నిబంధన ఉన్నప్పటికీ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల వ్యాపార రాజకీయ ప్రచార ప్రకటనల ఫ్లెక్సీలు నెలల తరబడి అలాగే ఉండిపోతా ఉన్నాయి మున్సిపల్ ఆదాయానికి గండి పడుతుంది ఈ క్రమంలోరోడ్ల మధ్యలో డివైడర్లకు అనుకొని ఉన్న స్తంభాలకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గాలికి అటూ ఇటూ కదులుతూ ఇరువైపులా టూవీలర్ల పై వెళుతున్న ప్రయాణికులకు ఫ్లెక్సీలు తగులుకొని ఎదురుగా వస్తున్న టూవీలర్లకు వెహికల్ లకు తగులుకొని ప్రమాదాలు చోటు చేసు కుంటున్నాయి లేదా టూ వీలర్ నుంచి రోడ్డుపై పడడంతో కాళ్లు చేతులు విరగడం తలలు పగలడంతో రోడ్లు రక్తసిక్తంగా మారుతున్నాయి పట్టణంలోనిప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు అలాగే ఉంచడంతో ఎండకు ఏండి వానకు తడిసి గాలికి అటు ఇటు ఊగి రోడ్లపై వెళ్తున్న పాదాచార్లపై రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే కూరగాయలు పండ్లు టీ హోటల్స్ పాండ్ డబ్బాలు అమ్ముకునే వారిపై పడుతున్నాయి వాహనాలపై ఆటోలపై బస్సులపై పడడంతో పలుసార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని పట్టణం ప్రజలు వ్యాపోతున్నారు గతంలో బి ఆర్ఎస్ పాలకుల హయాంలో మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో పట్టణంలో రోడ్ల విస్తరణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసేందుకు కేటీఆర్ విచ్చేసిన సమయంలో ఆ పార్టీకి చెందిన నాయకులు స్వాగతం పలుకుతూ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను చూసిన మంత్రి అప్పటి మున్సిపల్ చైర్మన్ పలుసరమేష్ గౌడ్ కు 10000 కౌన్సిలర్ వాకిటి శ్రీధర్ లకు 3000 చొప్పున జరిమానా విధించాలని మంత్రి ఆదేశించడంతో స్వయంగా మున్సిపల్ చైర్మన్ అయిన రమేష్ గౌడ్ వాకిటి శ్రీధర్లు మున్సిపాలిటీకి చెల్లించడం జరిగిందని కానీ నేటి కౌన్సిల్ సభ్యులు మాత్రం రాజకీయ నాయకుల ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎలాంటి రుసుము లేదని కౌన్సిల్ తీర్మానించిందని సమాచారం శాసనసభ్యులు ఎమ్మెల్యేమెగా రెడ్డి పుట్టినరోజు కు శుభాకాంక్షలు తెలిపేందుకు అలాగే ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విచ్చేసిన సమయంలో రోడ్ల వెంబడి ప్రధాన కూడళ్లలో పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఆకాశాన్నంటే ఎత్తులో ప్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో సింహభాగం మున్సిపల్ చైర్మన్ పట్టణ మొదటి పౌరుడు పుట్టపాక మహేష్ దే ఉండడం అలాగే ప్రభుత్వ కార్యాలయల ఎదుట ఇంకా చెప్పాలంటే పోలీస్ స్టేషన్ ఎదురుగా కూడా ఎమ్మెల్యే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఆయా కార్యాలయాల అధికారులు ఆక్షేపించకపోవడం విశేషం ఎందుకంటే అధికారంలో వారి ప్రభుత్వమే ఉండడం చేత మౌనంగా ఉండి పోతున్నారని తెలుస్తోంది అయితే ఫ్లెక్సీల తయారీలో ప్లాస్టిక్ ఉండడం చేత ఫ్లెక్సీలను ప్రభుత్వం నిషేధించిందిని భూమిలో మిళితం కాకుండా పర్యావరణానికి నష్టాన్ని కలిగిస్తుందని అందుకే అందరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు ఈ పరిస్థితి ఒక వనపర్తి మున్సిపాలిటీ లోనే కాకుండా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ పరిధిలో మండలాల కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొందని ఈ సమస్య స్థానిక సంస్థల కలెక్టర్ లేదాజిల్లా కలెక్టర్ లు స్పందించి ఫ్లెక్సీల పై ఓ నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
విచ్చలవిడిగా ఫ్లెక్సీలో ఏర్పాటు
Related Posts
రోడ్డు భద్రత,సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం:ఎస్సై కురుమయ్య
SAKSHITHA NEWSరోడ్డు భద్రత,సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం:ఎస్సై కురుమయ్య నర్వ:-రోడ్డు భద్రత,సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు నర్వ మండలం పతేర్చేడ్ గ్రామంలో ఉన్న జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో స్థానిక ఎస్సై కురుమయ్య అధ్వర్యంలో…
కంభం పరిదిలోని ఎక్సైజ్ శాఖ గీత కులాలకు మద్యం దుకాణాల కేటాయింపు
SAKSHITHA NEWSకంభం పరిదిలోని ఎక్సైజ్ శాఖ గీత కులాలకు మద్యం దుకాణాల కేటాయింపు గురించి ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు కంభం ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ ఇన్స్పెక్టర్. ఈ సందర్బంగా స్టేషన్ కు సంబంధించిన వివరాలను తెలియజేయడం జరిగింది.…