APSLPRB has made robust arrangements for the Preliminary Written Test of Police Constable Posts.
తిరుపతి జిల్లా:
APSLPRB పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక వ్రాత పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 57 పరీక్షా కేంద్రాలు తిరుపతి జిల్లాకు చెందిన మొత్తం 31,588 వేల మంది అభ్యర్థులు.
ఉదయం 10 గంటల నుండీ మధ్యాహ్నం 1 గంట వరకు కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షలు ఉంటాయి.
అభ్యర్థులను ఉదయం 9 గంటల నుండి పరీక్షా హాల్ లోకి అనుమతి.
పరీక్షా సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతి లేదు.
పరీక్ష రాయుటకు వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థిని పూర్తిగా తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి అనుమతించబడతారు
పరీక్ష రాసిన తర్వాత పరీక్ష సమయము ముగిసిన తర్వాతనే బయటకు పంపడం జరుగుతుంది.
పరీక్షా కేంద్రాల వద్ద మొబైల్ కౌంటర్ మరియు బ్యాగేజ్ కౌంటర్ల ఏర్పాటు చేయడం జరిగింది.
ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా గదిలోకి అనుమతిలేదు.
అభ్యర్థులు తమ హాల్ టికెట్లతో పాటు ఒక ఫొటో గుర్తింపు కార్డు మరియు బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్నులు మాత్రమే తీసుకురావాలి
అభ్యర్థులు ఎవరు కూడా అవకతవకలకు పాల్పడకండి పాల్పడిన యెడల క్రిమినల్ కేసులు నమోదు చేయగబడతాయి వారు భవిష్యత్తులో ఎటువంటి ఉద్యోగాలకు అనర్హులు.
ఆర్.టి.సి. బస్స్టాండ్, రైల్వే స్టేషన్ మెదలగు ప్రాంతాలలో హెల్ప్ డెస్క్ లతో పాటు అభ్యర్థుల సౌలభ్యం కోసం ఉదయం 7 నుంచి 8:45 వరకు పోలీసు వాహనాల ఏర్పాటు.
జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,
తిరుపతి జిల్లాలో ఈనెల 22 వ తేదీ ఆదివారం జరుగనున్న కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక వ్రాత పరీక్షల నేపథ్యంలో తీసుకున్న బద్రతా చర్యలు నియమ నిబందనల పై తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., వెల్లడించారు
.
తిరుపతి నగరం నందు 37 పరీక్షా కేంద్రాలలో 20,602 మంది, పుత్తూరు నందు 13 పరీక్షా కేంద్రాలలో 6,444 మంది, గూడూరు నందు 7 పరీక్షా కేంద్రాలలో 4,542 మంది అభ్యర్థులు జిల్లా వ్యాప్తంగా మొత్తం 57 పరీక్షా కేంద్రాలు తిరుపతి జిల్లాకు చెందిన మొత్తం 31,588 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు.
తిరుపతి, పుత్తూరు, గూడూరు నందు గల స్ట్రాంగు రూంలు పరీక్షా కేంద్రాల వద్ద సుమారు 700 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తుతో పాటు సిసి కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.
పరీక్షా కేంద్రాల దగ్గర 144 సి.ఆర్.పి.సి. అమలులో ఉంటున్నందున, ఎవ్వరూ గుంపులుగా ఉండకూడదన్నారు. అంతేకాకుండా పరీక్షా కేంద్రాలకు దగ్గరలో గల జెరాక్స్ షాపులను మూసి వేయడంతో పాటు వైఫై సేవలను కూడా నిలిపివేస్తున్నమన్నారు. 100 మీటర్ల పరిధి వరకు ఎటువంటి వాహనాలను పార్కింగ్ చేయరాదు.
అభ్యర్థులు తమ హాల్ టికెట్లతో పాటు ఒక గుర్తింపు కార్డు మరియు బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్నులు మాత్రమే తీసుకురావాలని మాల్ ప్రాక్టీస్, కాఫీయింగ్ తదితర అక్రమాలకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
పరీక్షా కేంద్రాల బయట ఎలాంటి అక్రమాలకు తావులేకుండా తిరుపతి, గూడూరు, పుత్తూరు పరీక్షా కేంద్రాల వద్ద డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో నిరంతర ఆకస్మిక తనిఖిల నిమిత్తం ఫ్లైయింగ్ స్క్వాడ్ లు నియమించబడ్డాయి అని అన్నారు.
అలాగే సోషల్ మీడియాలో కానీ ఎవరైనా డబ్బులు కడితే కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తామని మోసగాళ్లు నమ్మ పలికితే నమ్మవద్దు. పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు రిక్రూట్మెంట్ బోర్డ్ ఒకటి ఉంది ఫిజికల్ గా, అన్ని ఎగ్జామ్లలో ఉత్తీర్ణత అయితేనే ఉద్యోగాలు వస్తాయి.
కాపింగ్ లేదా మాల్ ప్రాక్టీస్ పాల్పడి పట్టు పడితే తదుపరి పోలీస్ నియామకాల్లో ప్రవేశం జీవితాంతం కోల్పోవడమే కాకుండా వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడుతుంది.
ఎటువంటి మోసాలకు తావులేదు. ఎవ్వరిని నమ్మకండి ఎవరైనా మీకు ఈ విధంగా మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకుని ఉంటే వెంటనే మాకు ఫిర్యాదు చేయండి వారి పైన కఠిన చర్యలు తీసుకుంటాం.
ఆర్.టి.సి. బస్స్టాండ్, రైల్వే స్టేషన్ మెదలగు ప్రాంతాలలో హెల్ప్ డెస్క్ లతో పాటు అభ్యర్థుల సౌలభ్యం కోసం పోలీసు వాహనాలను కూడా ఏర్పాటు చేసి నగరంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ట్రాఫిక్ డిఎస్పి ల నేతృత్వంలో తగిన ఏర్పాట్లు చేశామన్నారు.
తిరుపతి ఇంచార్జ్ గా అదనపు ఎస్పీ కులశేఖర్ L&O, గూడూరు ఇంచార్జ్ గా సెబ్ జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర, పుత్తూరు ఇంచార్జ్ గా అడిషనల్ ఎస్పి శ్రీమతి విమల కుమారి క్రైమ్ వారిని నియమించి పటిష్ట చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ .పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., వెల్లడించారు.