బీసీ సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ

Spread the love

Appreciation gathering under the auspices of BC Sangam

బీసీ సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ
నూతనంగా ఎన్నికైన జిల్లా గ్రంధాలయ చైర్మన్ కు ఘన సన్మానం

సాక్షిత : బీసీ నాయకుడు రాజు గౌడ్ జిల్లాస్థాయి పదవి పొందడం హర్షదాయకమని జిల్లా బీసీ సంఘం ప్రతినిధులు కొనియాడారు. జిల్లా బీసీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ కు ఏర్పాటుచేసిన అభినందన సభలో నాయకులు, వక్తలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ను ఘనంగా సన్మానించారు.

అనంతరం సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ…. బిసి సంఘ యువ నాయకుడు జిల్లాస్థాయి పదవి పొందడం యావత్ బిసి వర్గానికి గౌరవమన్నారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్ నేతృత్వంలో జిల్లా గ్రంధాలయ శాఖ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, వికారాబాద్ జిల్లా బిసి మహిళా అధ్యక్షురాలు మాధవి లత, తాండూరు మహిళా అధ్యక్షురాలు నాయికోటి జ్యోతి, సుకూర్, మాధవి లత, శ్రీనివాస్ చారి, వెంకటేష్, శివానంద్, లక్ష్మణ్ చారి, ఎర్రం శ్రీధర్, రాము ముదిరాజ్, నాయి కోటి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page