SAKSHITHA NEWS

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పలువురికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 2,00,000/- రెండు లక్షల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF- LOC మంజూరి పత్రాలను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబాలకి అందచేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని

CMRF LOC – వివరాలు

1.మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ కి చెందిన శ్రీ రాజేష్ కుమార్ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,00,000/- ఒక లక్ష రూపాయలు

2.కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ కి చెందిన శ్రీమతి హుస్సేనమ్మ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,00,000/- ఒక లక్ష రూపాయలు

మొత్తం 2,00,000 /- రెండు లక్షల రూపాయలుగా మంజూరి అయినవి అని,అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ఎమ్మెల్యే గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహ్మద్ కాజా మరియు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 13 At 4.07.05 Pm

SAKSHITHA NEWS