అద్భుతమని గొప్పలు చెప్పుకున్న కాలేశ్వరం పై నోరు విప్పని కేసీఆర్
ప్రజల సంపదను దోపిడీ చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయడానికి ప్రజలు రెడీ
మిషన్ భగీరథ పథకం పూర్తిగా అవినీతిమయం
ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను కోత కోసిన బిఆర్ఎస్
ఆడబిడ్డ పెళ్లికి లక్ష కట్నం, తులం బంగారం ఇస్తాం
బోనకల్ మండలం ఎన్నికల ప్రచారంలో సీఎల్పీ నేత భట్టి
భట్టి ఎన్నికల ప్రచారానికి ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ సంఘీభావం
ప్రపంచంలోనే కాలేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అద్భుతంగా నిర్మించామని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ కుంగుబాటుపై ఎందుకు మాట్లాడటం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఆదివారం మధిర నియోజకవర్గం బోనకల్ మండలం సీతాపురం, పెద్ద వీరవెల్లి, జానకిపురం, చిన్న బీరవెల్లి, నారాయణపురం, రావినూతల,గార్లపాడు, రామాపురం గ్రామాల్లో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ హాజరై సంఘీభావం ప్రకటించి భట్టి విక్రమార్కను గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భట్టి విక్రమార్క పర్యటించిన గ్రామాల్లో అడుగడుగున ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులతో వెల్కమ్ చెప్పి వీర తిలకం దిద్ది విజయభవాంటూ దీవించారు. పెద్ద ఎత్తున కదిలి వచ్చిన జనాలతో ఆయా గ్రామాలు జన సంద్రంగా మారాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు ఉద్దేశించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడారు. నోరు తెరిస్తే అద్భుత ప్రాజెక్ట్ అని గొప్పలు చెప్పుకున్న కాలేశ్వరం కుంగుబాటుపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఇప్పుడు నోరు విప్పకపోవడం సిగ్గుచేటు అన్నారు. కాలేశ్వరం నిర్మాణం పేరిట లక్ష కోట్లు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దోపిడీ అధికారంలోకి రాగానే కక్కిస్తామన్నారు.
మేడిగడ్డ మాదిరిగానే అన్నారం సుందిళ్ల ప్రాజెక్టులు కుంగిపోతున్నాయని నీళ్ళను నింపడానికి ఆ ప్రాజెక్టులు పనికిరావని జాతీయ సేఫ్టీ అధికారులు తేల్చి చెప్పారని దానిపై ఎందుకు విచారణకు కేసిఆర్ సిద్ధం కావడం లేదని నిలదీశారు.
మిషన్ భగీరథ పేరిట బిఆర్ఎస్ పాలకులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, ఈ పథకం కోసం ఖర్చు చేసిన 50 వేల కోట్లు బిఆర్ఎస్ పాలకుల జేబుల్లోకి వెళ్ళాయని దుయ్యబట్టారు. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేసి ప్రజల ప్రభుత్వం తెచ్చుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. పది సంవత్సరాలుగా తెలంగాణ సంపదను టిఆర్ఎస్ పాలకులు దోపిడీ చేసినందునే ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన సంక్షేమాలకు సైతం కోత పెట్టారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంట్లో ఉన్న ఇద్దరికి పింఛన్ ఇస్తే.. ధనిక రాష్ట్రంలో ఒకరికి కోత కోసి ఒకరికి మాత్రం ఇస్తూ సంక్షేమంలో నెంబర్ వన్ అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి అన్నారు
డ్రిప్ ఇరిగేషన్, పాలిహౌస్, కూరగాయల పందిరిలో సాగు తోటలకు ప్రోత్సాహకంగా కాంగ్రెస్ ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇవ్వగా బిఆర్ఎస్ ప్రభుత్వం కోత విధించిందన్నారు. 9రకాల నిత్యవసర వస్తువులను టిఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తివేసి రేషన్ దుకాణాలను బియ్యం దుకాణాలుగా మార్చిన ఘనతను దక్కించుకుందని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇండ్లను ఎత్తివేసిన దుర్మార్గపు ప్రభుత్వాన్ని దంచుదాం, దించుదాం, ప్రజల సంపద ప్రజలకు పంచుదాం అని ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ కు పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారని వెల్లడించారు కాంగ్రెస్ ను గెలిపించుకుంటే ఆడపిల్ల పెళ్లికి లక్షా రూపాయలు, తులం బంగారం కానుకగా ఇస్తామని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యా, వైద్యం
పరిశ్రమలు, రోడ్లు, గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు.
ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గుండెల్లో వణుకు పుట్టించిన నేత భట్టి
కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టించిన ఆరు గ్యారంటీలు
లిక్కర్ కేసులో కవితను ఎందుకు అరెస్టు చేయలేదు
కాంగ్రెస్ ను ఓడించడానికి బిజెపి బిఆర్ఎస్ ఎంఐఎం కుట్ర
భట్టి ఎన్నికల ప్రచారంలో ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ
——-+++++—–
రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ప్రజల గొంతుకగా కేసీఆర్ గుండెల్లో వణుకు పుట్టించిన నేత భట్టి విక్రమార్క ఎన్నికల్లో గెలవడం తెలంగాణ రాష్ట్రానికి అత్యంత అవసరమని ఆంధ్రప్రదేశ్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ అన్నారు.
ప్రకటించిన ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తద్యమైనందున కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తుందన్నారు.
బిఆర్ఎస్ అవినీతి అక్రమాలు, బిజెపి మతోన్మాదం, ఎంఐఎం అవకాశవాద రాజకీయాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అలుపెరుగని పోరాటం చేసే శక్తిని ఇచ్చిన మధిర ప్రజలు ఎన్నికల్లో నాలుగో సారి ఆశీర్వదిస్తే కాబోయే ప్రభుత్వ ఏర్పాట్లు దిక్సూచిగా నిలుస్తాడని వివరించారు.
తెలంగాణ వచ్చిన ప్రజలు బాగుపడలేదని, కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడ్డారని విమర్శించారు.
తెలంగాణ వస్తే ప్రజలకు ఏమి రాకున్నా
కెసిఆర్ కు వెయ్యి ఎకరాలు, కేటీఆర్ కు 400 ఎకరాలు, కవితమ్మకు వంద ఎకరాల ఫామ్ హౌస్ లు వచ్చాయని దుయ్యబట్టారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అందర్నీ అరెస్టు చేసిన బిజెపి ప్రభుత్వం కేసీఆర్ కూతురు కవితను ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు.
లిక్కర్ కుంభకోణంలో కవితమ్మ అరెస్టు కాకుండా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను కేసీఆర్ మేనేజ్ చేస్తున్నాడని చెప్పారు.
బిజెపి, బిఆర్ఎస్, ఎంఐఎంలు కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కుట్రలు చేస్తున్నాయని, ఈ కుట్రలను ప్రజాస్వామికవాదులు తిప్పి కొట్టాలని కోరారు.
కెసిఆర్, కేటీఆర్, హరీష్, కవిత, అసుదుద్దీన్ ఓవైసీలకు మీడియా వంత పాడుతున్నదని,
కాంగ్రెస్ గాలి రాష్ట్రంలో ప్రభంజనంలా వీస్తున్న మీడియాలో చూపించకుండా బిఆర్ఎస్ పాలకులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ కాంగ్రెస్ ప్రభుత్వాలు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారని, తెలంగాణలో కూడా ఇస్తామని చెప్పారు.
సామాజిక రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు అందరికీ అందాలని రాహుల్ గాంధీ కులగణన జరగాలని కోరుతున్నారని తెలిపారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని, రాహుల్ ఈ దేశానికి ప్రధాని కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలు గర్వించే విధంగా భట్టి విక్రమార్కను అత్యధిక మెజార్టీతో మధిర ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు