Ankus should be given an opportunity as the vice chairman of the market
కరీంనగర్ జిల్లా వేణువంక మండలంలోని ఉద్యమ కారుడికి మద్దత్తు గా దూదేకుల కులస్తులు,,, – దూదేకుల సామాజిక వర్గానికిచెందిన మొహమ్మద్ అంకూస్ కి మార్కెట్ వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించాలని
వీణవంక సంఘ నాయకుల విజ్ఞప్తి వీణవంక :జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా మహమ్మద్ అంకూస్ కి అవకాశం కల్పించాలని వీణవంక మండల దూదేకుల సంఘ నాయకులు సోమవారం తెరాస అధిష్టానం కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా వీణవంక మండల అధ్యక్షుడు మొహమ్మద్ మహబూబ్ అలీ విలేకరుల తో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం మొదటి నుండి పనిచేసిన ఉద్యమ కారుడు, విద్యావంతుడు, వెనుకబడిన దూదేకుల సామజిక వర్గం నికి చెందిన మొహమ్మద్ అంకూస్ కి ఈ సారి అవకాశం కల్పించాలని జిల్లా మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లాపరిషత్ ఛైర్పర్సన్ కనుమల్ల విజయాగణపతి, ఎంమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, తెరాస నియోజకవర్గం ఇంచార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో దూదేకుల సంఘ నాయకులు హజిమియా, బందే అలీ, రోషన్ అలీ, షహీద్ పాషా, ఖజామియా, రఫీ, హుస్సేన్ (bsnl)అక్బర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమకారుడిగా మొహమ్మద్ అంకుస్ చాలా మంచి మంచి కార్యక్రమంలో పాల్గొన్నారు.