అంగన్వాడి కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Spread the love

సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో మన ఊరు మన అంగన్వాడి బాట కార్యక్రమాన్ని సర్పంచ్ దేశ బోయిన మల్లమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చిన్నపిల్లలను అంగన్వాడీ సెంటర్లకు పంపించాలని అంగన్వాడీ కేంద్రాలలో ఇంగ్లీష్ మీడియం విద్యను బోధిస్తున్నారని అలాగే పిల్లలకు ఆటపాటలతో సృజనాత్మక కార్యక్రమాలతో పిల్లలకు ప్రీ స్కూల్ విద్యను అందిస్తున్నారని, అంగన్వాడి కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఎం.అండాలు, పి.పద్మ, వి.సునీత ఆయాలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page