చదువుతో పాటు, అన్ని రంగాలలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సేంట్. మార్టిన్స్ హైస్కూల్, మల్కాజిగిరి. నేడు అంధులకు కొండంత సహాయం చేసారు. “ఇట్రాడ్ సోచ్ ఫౌండేషన్” వారు చేపట్టిన ఓల్దేజ్ హోమ్ ఫర్ బ్లైండ్ ప్రాజెక్ట్ కోసం సేంట్. మార్టిన్స్ హైస్కూల్ మల్కాజిగిరి యాజమాన్యంతో సహాయం కోరడం జరిగింది. అందుకు వారు అంగీకరించి, తమ స్కూల్ యొక్క విద్యార్థి విద్యార్థులకు సమాజం మరియు సేవా దృక్పధం గురించి వివరించి, సహాయ నిమిత్తం అందరు పాల్గొని, సహకరించాలని పిలుపునిచ్చారు. పిల్లలు, టీచర్స్, స్కూల్ ప్రిన్సిపాల్, స్కూల్ స్టాఫ్ అందరు కలసి రూపాయలు లక్ష యాభై వేలు అందించడం జరిగింది. ఇట్రాడ్ సోచ్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ.మధుకర్ రెడ్డి సేంట్.మార్టిన్స్ హైస్కూల్ అధినేత గౌరవనీయులు శ్రీ.మర్రి లక్ష్మణ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు. అంధులు తమ నైపుణ్యాన్ని చాటుతూ, అద్భుతమైన పాటలు పాడుతూ పిల్లలకు మోటివేషన్ మరియు ఇన్స్పిరేషన్ కలిగిన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మానవసేవే మాధవసేవ అని అందరు ప్రశచించారు.
చదువుతో పాటు, అన్ని రంగాలలో అందరికీ ఆదర్శంగా
Related Posts
సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
SAKSHITHA NEWS సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:జనవరి 17తెలంగాణకు భారీగా పెట్టు బడులను సమీకరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సింగపూర్, దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఆయన…
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించండి
SAKSHITHA NEWS కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించండి..ఎమ్మెల్యే జిఎంఆర్ కు వినతిపత్రం అందించిన బీరంగూడ వాసులు అమీన్పూర్ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం బీరంగూడ ప్రాంతానికి చెందిన పుర ప్రముఖులు,…