SAKSHITHA NEWS

ఘనంగా వల్లభ నారాయణస్వామి యాత్ర
స్వామివారికి ప్రత్యేక పూజలు
-పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్
(శ్రీకాకుళం)
ప్రతి ఒక్కరూ భక్తి భావం కలిగి, ఐకమత్యంతో మెలగాలని అప్పుడే గ్రామాలను కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోగలమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రూరల్ మండలం నైరా గ్రామంలో వల్లభ నారాయణస్వామి రథయాత్ర మహోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ శుక్రవారం పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు శంకరకు సాలువాతో సత్కరించి, మెమొంటోను అందజేశారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో గ్రామాల్లో మరల అభివృద్ధి పనులు జ్వరం ఎందుకు ఉన్నాయని అన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 15వ ఆర్థిక సంఘం నిధులను కాజేసి గ్రామాలను పూర్తిగా నాశనం చేశారన్నారు. కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్ శక్తి, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు కూడా నోచుకోక పల్లెలన్నీ దీనవస్థలో నిలిచిపోయాయి అన్నారు. గత ప్రభుత్వంలో కనీసం బ్లీచింగ్ కొనే పరిస్థితి కూడా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ పై ప్రత్యేకంగా దృష్టి సారించి కేంద్రం నుండి నిధులను తీసుకువచ్చి గ్రామాల అభివృద్ధికి స్వీకారం చుట్టారన్నారు. రికార్డు స్థాయిలో 13వేల గ్రామసభలను ఒకేరోజు నిర్వహించి పల్లె పండుగల పేరుతో అభివృద్ధి పనులను గుర్తించారు అన్నారు. సంక్రాంతి నాటికి ఆయా పనులను ప్రారంభించి గ్రామాలకు కొత్త శోభ తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గ్రామస్తులంతా ఈ రథయాత్ర ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు పూజలు నిర్వహించారు.