SAKSHITHA NEWS

బండి సంజయ్ విషయంలో క్లారిటీ ఇచ్చిన అమిత్ షా.. వారికి వేరే పదవులు

BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
దీంతో ఈ రకమైన చర్చకు తెరపడినట్టే అని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర నేతలతో సమావేశానికి ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో తాజా పరిస్థితులను అధ్యయనం చేసిన అమిత్ షా, నడ్డా బండి సంజయ్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తంచేసినట్లు సమాచారం. ఆయా పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు పార్టీ అధ్యక్షుడి మార్పుపై చాలా ఆశలు పెట్టుకున్నారు

.
అయితే సంజయ్ నాయకత్వం పట్ల ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేయడంతో ఇదే విషయాన్ని అమిత్ షా, నడ్డా రాష్ట్ర నేతలకు చెప్పినట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారికి జాతీయస్థాయిలో ప్రత్యామ్న్యాయ పదవులు కట్టబెట్టాలన్న ఆలోచన బీజేపీ అధినాయకత్వం చేస్తున్నట్లు సమాచారం.బీజేపీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ ఎంతో బలోపేతమైందని ఆయన చేస్తున్న పోరాటాలు, నిర్వ హించిన ప్రజా సంగ్రామ యాత్రల వల్ల బీఆర్ఎస్‌కు పోటీ ఇస్తున్నట్టు అగ్రనేతలు వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఇటీవల జరిగిన బీజేపీ ప్లీనరీ సమావేశంలోనూ బండి సంజయ్ పనితీరును ప్రశంసించిన మోడీ ఆయనను ఇతర నేతలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.

ఇక ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను మార్చాలని రాష్ట్రానికి చెందిన కొందరు వలస నేతలు చేస్తున్న ప్రయత్నాలకు అధినాయకత్వం గండికొట్టడంతో వారి ఆశలు బ్రేక్ పడినట్టయ్యింది. బండి సంజయ్ నాయకత్వంలో కచ్చి తంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరు తుందని పార్టీ సీనియర్లు ఆయనతో సమన్వయం చేసుకుని ప్రజలకు చేరువై పనిచేయాలని కోరినట్లు సమాచారం.


SAKSHITHA NEWS