18 సంవత్సరాలు నిండిన యువకులందరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి

Spread the love

All young people who have reached the age of 18 must be registered to vote

18 సంవత్సరాలు నిండిన యువకులందరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి
మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్
రంగా రెడ్డి జిల్లా సాక్షిత


షాద్ నగర్ పట్టణంలోని 25వ వార్డు పద్మావతి కాలనీ కుంటబడి స్కూల్లో కౌన్సిలర్ మాధురి నందకిశోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు.

ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి రాష్ట్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పిస్తుంది 18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులు ఈ నెల 26,27 వ తేదీ,డిసెంబరు 3,4వ తేదీల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ అవకాశాన్ని 18 సంవత్సరాల నిండిన యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం ప్రతి పోలింగ్ బూతులలో నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో బి ఎల్ ఓస్ ,కె సంతోష, దత్తత్రేయ, అరుణ, ఉమాకాంత,తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page