వనపర్తి జిల్లా కేంద్రంలో శనివారం కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో నిర్వహించే భహిరంగ సభ బందోబస్తును జిల్లా అడిషనల్ ఎస్పీలు రాందాస్ తేజావత్ మరియు వీరారెడ్డిలు పరిశీలించారు అలాగే హెలిపాడ్ ఇద్దరూ అడిషనల్ ఎస్పీలు, ముగ్గురు డిఎస్పీలు, ఏడు గురు సీఐలు, 30 మంది ఎస్ఐలు, ఏఎస్సై హెడ్ కానిస్టేబుల్ 60 మంది, పోలీస్ కానిస్టేబుల్ 199, ఉమెన్ పోలీసులు 21 మొత్తం 322 మంది తో ఏర్పాట్లు చేయడం జరిగింది.
వనపర్తి ఎస్.పి రక్షిత కె మూర్తి ఐపిఎస్ ఆదేశానుసారం జిల్లాఅడిషనల్ ఎస్పీ శ్రీ రామదాసు తేజావత్ ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ వీరారెడ్డి పరిశీలించారు.
హెలిపాడ్, సభాస్థలి ప్రాంగణం, గ్యాలరీల ఏర్పాటులు పరిశీలించడమైనది.
బందోస్తు సంబంధించి పోలీస్ అధికారులకు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ…. కేంద్ర హోంమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని, విధుల్లో ఉన్న పోలీసు అధికారుల సిబ్బంది సంయమానం పాటించాలని అధికారులకు సూచించారు. కేంద్ర హోం శాఖ మంత్రివర్యుల పర్యటన సజావుగా అయ్యేటట్లు చూడాలని పోలీసు అధికారులకు తెలిపారు. అడిషనల్ ఎస్పీ తో పాటు వనపర్తి అడిషనల్ ఎస్పీ ఏఆర్ శ్రీ వీరారెడ్డి డిఎస్పి వెంకటేశ్వరరావు వనపర్తి సీఐ నాగభూషణం స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ ముని రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ అప్పలనాయుడు , స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు నరేష్ ,మల్లేష్ వనపర్తి టౌన్ ఎస్సై లు జయన్న , రామరాజు జిల్లా పోలీస్ సిబ్బంది ఉన్నారు.
అదేవిధంగా కొత్తకోట నుండి వచ్చే కార్యకర్తలు భగీరథ చౌరస్తా మీదగా ఇందిరా పార్క్ బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు పార్కింగ్ కలదు
గోపాల్పేట రూట్ నుండి వచ్చేవారు బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు పార్కింగ్ కలదు
పెబ్బేరు రూట్ నుండి వచ్చే వారు బస్ డిపో పక్కన మరియు గంజి గంజిలో పార్కింగ్ కలదు.