SAKSHITHA NEWS

టీఎస్ పిఎస్సి ద్వారా ఆదివారం నిర్వహించనున్న అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి. అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

టీఎస్ పిఎస్సి ద్వారా ఆదివారం నిర్వహించనున్న అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో పరీక్షల ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరీక్షలను రాసే అభ్యర్థులు ఓయంఆర్ షీట్ లలో తప్పులు దొర్లకుండా చూడాలని తెలిపారు.

అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షలను వ్రాసే 6,049 మంది అభ్యర్థుల కొరకు 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3 రూట్లను ఏర్పస్టుచేసి, రూట్లవారిగా 3గురు లైజనింగ్ అధికారులు, 15 మంది అసిస్టేంట్ లైజనింగ్ అధికారులను, 14 మంది చీఫ్ సూపరింటెండెంట్ల ను నియమించడం జరిగిందన్నారు. ఓయంఆర్ షీట్ లో వివరాల నమోదు, బబ్లిగ్ విధానంలో తప్పులు దొర్లకుండా పటిష్టమైన చర్యలను చేపట్టాలని టిఎస్పిఎస్సీ ఆదేశించిందని, అందులో బాగంగా పరీక్షా కేంద్రంలో పరీక్షా సమయానికి ముందే ఓయంఆర్ షీట్ పై అభ్యర్థులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

ఈనెల 5న ఆదివారం ఉదయం, మద్యాహ్నం నిర్వహించే పరీక్షలకు సంబంధించిన పశ్రాపత్రాలను ఎప్పటికప్పుడు తీసుకు వెళ్లాలన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవని అదనపు కలెక్టర్ తెలిపారు. ఏదైనా ఫోటో ఐడెంటీ కార్డులు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, తమ వెంట తీసుకోని రావాలన్నారు పరీక్షాకేంద్రాలలో ఖచ్చితంగా సిసి కెమెరాలు ఉండేలా చూడాలని, చీఫ్ సూపరింటెండెంట్లు ప్రశ్నాపత్రాలను సిసి కెమెరాలో స్పష్టంగా కనిపించేలా తెరవాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలు లేకుండా పకడ్బందిగా పరీక్షలు జరిగేలా పటిష్టఏర్పాట్లను చేపట్టాలని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి శిరీష, కలెక్టరేట్ ఎఓ శ్రీనివాసరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS