బాలుని చావుకు కారణమైన అధికారులపైనచర్యలు తీసుకోవాలి*

Spread the love


Action should be taken against the officials responsible for the death of the boy who fell into the drainage canal*

డ్రైనేజీ కాలువలో పడి చనిపోయిన బాలుని చావుకు కారణమైన అధికారుల పైన చర్యలు తీసుకోవాలి*


మున్సిపల్ కమిషనర్ గారితో ఫోన్ లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేసిన*
— నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి షాద్ నగర్ బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి


రంగారెడ్డి జిల్లా సాక్షిత బ్యూరో ప్రతినిధి


షాద్ నగర్ పట్టణంలో ని 2 వ వార్డులోని తిలక్ నగర్ లో నివసిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వలస కార్మికుడు నిసార్ ఏడాదిన్నర అబ్బాయి డ్రైనేజీ కాలువలో పడి చనిపోయాడు .వారి కుటుంబాని బీజేపీ నాయకులు షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు అందే బాబయ్య ,పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ,మల్చాలం మురళి ,చెట్ల వెంకటేష్ ,శ్యామసుందర్ రెడ్డి తో కలిసి పరామర్శించారు .సంఘటన స్థలాన్ని పరిశీలించారు

ఈ సందర్భంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క మున్సిపాలిటీ అధికారుల వైఫల్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగి పసి పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మధ్య కాలంలో నే సొలిపూర్ లో ముగ్గురు చనిపోయారు ఇక్కడ మున్సిపాలిటీ వారు డ్రైనేజీ కాలువలను సరిగా నిర్మించని కారణముగా ఈ అబ్బాయి కాలువలో పడి చనిపోయాడు.

చనిపోయిన వారి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ,షాద్నగర్ ప్రజలు మున్సిపాలిటీ కి వేల రూపాయలు పన్నులను కడుతున్నారు మరియి కేంద్రం నిధులు ఇస్తుంటే ఈ డబ్బు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు డ్రైనేజీ లు లేని కారణంగా ఒక అబ్బాయి చనిపోవడం చాలా బాధాకరం .

ఇంకా ఎంత మంది చనిపోతే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ,అదే విదంగా మున్సిపాలిటీ చైర్మన్ ,కౌన్సిలర్లు స్పందిస్తారు ?? ఈ సంఘటన గురించి మున్సిపల్ కమిషనర్ ని ఫొన్ లో ప్రశ్నిస్తే వారు తమ తప్పును కప్పి పుచ్చు కోవడం కోసం తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవలని తల్లిదండ్రుల పైన తప్పులు వేస్తే ఆగ్రహం వ్యక్తం చేశారని దీనికి కారణమైన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

Related Posts

You cannot copy content of this page