SAKSHITHA NEWS

ఎన్.సి.సి( NCC)సెలక్షన్లు వెంటనే ప్రారంభించాలని – ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా
విద్యార్థి నాయకులనుఅరెస్టు చేసిన పోలీసులు

సాక్షిత వనపర్తి
జిల్లా కేంద్రంలోనిప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ( NCC) సెలక్షన్లు చేయలని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) వనపర్తి శాఖ ఆధ్వర్యంలో రాజీవ్ చౌరస్తాలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కనపర్తి ఏబీవీపీ జిల్లా నాయకులు సాతర్ల అర్జున్ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలలో NCC సెలక్షన్స్ చేయకపోవడం సిగ్గుచేటు, అని దేశభక్తి మరియు క్రమశిక్షణ గల విద్యార్థిలను తయారు చేసే NCC నీ వనపర్తి నుండి వేరొక చోటకు మార్చే కుట్ర జరుగుతా ఉన్నది. జిల్లా కేంద్రానికి ఎడ్యుకేషన్ హబ్ గా పేరు ఉందని అలాంటి జిల్లా కేంద్రం నుంచి NCC నీ వేరొక చోట తరిలించడం ఏమిటని ప్రశ్నించారు,

కేవలం (NCC)) ఎన్సిసి కొరకు జాయిన్ అయిన విద్యార్థుల జీవితాలు గందరగోళం లో కి , నెట్టబడుతున్నాయని అదే విషయాన్ని సంబంధిత అధికారులను అడిగితే ఇక్కడ NCC లేదు NCC కావాలి అంటే TC తీసుకొని వేరే కళాశాలలో చేరండి అని నిర్లక్ష్యంగా నిసిగ్గుగా సమాధానం ఇవ్వడం సరికాదని . ఇకనైనా ప్రభుత్వం మొండి వైఖరి వీడి విద్యార్థుల పక్షాన నిలబడి జిల్లాలో NCC నీ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో వెంటనే NCC సెలక్షన్లు చేయాలి అని డిమాండ్ చేశారు .లేనియెడల రాబోయే రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది అని హెచ్చరించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల వద్దకు చేరుకున్న పోలీసులు వారందరినీ చెదరగొడుతూ విద్యార్థి నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ, జిల్లా ఖేల్ కన్వీనర్ ఓంమేష్, వనపర్తి నగర కార్యదర్శి జ్ఞానేశ్వర్,రమ్య,తేజ, బంటి, గిరిధర్ నాయుడు, రాకేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS