
న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ కార్యాలయంలో గొడ్డంటి నారాయణరావు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పేద విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదగా స్కూల్ బ్యాగ్, పుస్తకాలు, పరీక్ష అట్టలు, పెన్నులు పెన్సిల్ సెట్లు వారికి అల్పాహారం కూడా అందించడం జరిగింది. ముఖ్య అతిథులుగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ రైటర్ బాబాజీ, బిజెపి నాయకులు ఓబీసీ మోర్చా రాష్ట్ర కోస్తాధికారి శివకుమార్ పట్నాయక్, ముస్లిం సంక్షేమ అధ్యక్షుడు ముక్తర్ అలీ సంస్థ అధ్యక్షురాలు రాజరాజేశ్వరి దేవి పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత సమయం విద్యార్థులకు పరీక్ష సమయమని ముందు నుంచి ప్రణాళికగా చదువుకొని పరీక్ష సమయంలో ఒత్తిడిని జయించాలని ఇష్టంగా చదివి అర్థం చేసుకొని పరీక్ష సమయంలో ప్రశ్నాపత్రం ఒకటి రెండుసార్లు పరీక్షించి జవాబులు రాయాలని ఒకవేళ సమయం కుదరకో లేక ఏ పొరపాటున జరిగిన ఎడల మరలా మనకు అవకాశం ఉంటుందని దానికి బాధపడి ఒత్తిడి పెంచుకొని అఘాయిత్యాలకు గురి కావద్దని పలువురు అతిథులు సూచించారు
చదువుతోపాటు దేహ దారిద్ర ఆటపాటలు సంగీతంతో పాటు పోటీ పరీక్షలు ఆహ్లాదకర వాతావరణ ఏర్పాటు చేసుకొని మన ఒత్తిడిని జయించాలని సూచించారు సంస్థ ద్వారా తల్లితండ్రులను ప్రత్యక్ష దేవులుగా భావిస్తూ వారి కలలకు ఆశయాలకు ఆదర్శంగా నిలుస్తూ ఎంతోమంది పేద పిల్లలను వారి యొక్క ప్రతిభలకు అనుకూలంగా తీర్చిదిద్దుతూ ఉచిత విద్య ద్వారా ఎన్నో సేవలు అందిస్తూ వారి ఉన్నత స్థానాలకు తోడుపడుతున్న న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ సంస్థను సభ్యులందరినీ కూడా పేరుపేరునా ప్రశంసించారు. అనంతరం వివిధ పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు అందిస్తూ వారందరూ ఉన్నత స్థానాలకు ఎదగాలని మరల వారు ఇటువంటి సేవా ద్వారా మరికొందరి విద్యార్థులు భవిష్యత్తులో వెలుగు నింపాలని అభిలాషించారు ఈ కార్యక్రమాన్ని సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సాయి వినయ్ కుమార్ సంస్థ కార్యాలయం ఇన్చార్జ్ జయలక్ష్మి పర్యవేక్షించగా షేక్ ఆసిఫ్, ఖలీద్, లోవరాజు, బుజ్జి, శాంతి, శోభారాణి, ధనలక్ష్మి పలువురు పాల్గొని విజయవంతం చేసినారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app