
చత్రపతి శివాజీ ని ఆదర్శంగా తీసుకోవాలి
మాజీ కార్పొరేటర్
ఉత్తమ్ చంద్ బండారి
ప్రతీ ఒక్కరూ చత్రపతి శివాజీ నీ ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ మాజీ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ బండారి అన్నారు.
చత్రపతి శివాజీ జయంతి వేడుకలను భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎన్డీయే కూటమి నేతలతో కలిసి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
మాజీ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ బండారి మాట్లాడుతూ
భరతమాత ముద్దుబిడ్డ,హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు,
మరాఠా సామ్రాజ్య స్థాపనకు కృషిచేసిన యోధుడు చత్రపతి శివాజీ నీ ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
చత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ఆయన కుమారుడు శంబాజీ జీవిత విశేషాలతో రూపొందిన “ఛావా “చిత్రాన్ని హిందువులందరూ తప్పకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
వన్ టౌన్ సామరంగ్ చౌక్ లో మాజీ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ బండారి ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్డీయే కూటమి నేతలతో కలిసి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూటమి నేతలు పొట్టి శ్రీహరి, డాక్టర్ హనుమంతరావు, వేంపలి గౌరీ శంకర్, రాజు సోలంకి, బండి కాళీ, పిళ్లా కళ్యాణ్, విశాల్ జైన్, పివి చిన సుబ్బయ్య, దుర్బేసుల హుస్సేన్, దొడ్ల రాజ తదితరులు పాల్గోన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app