SAKSHITHA NEWS

జిల్లా సమీకృత భవన సముదాయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.ఈ సమావేశంలో మంత్రితో పాటు కలెక్టర్ క్రాంతి,ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,విజయుడు, జడ్పీ చైర్ పర్సన్ సరిత,ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తదితరులు హాజరయ్యారు

.జిల్లా అధికారులు అందరూ హాజరవాల్సి ఉండగా పర్యాటక శాఖ మంత్రి సమీక్షకు పర్యాటక శాఖ అధికారులు హాజరుకాకపోవడం విశేషం.అధికారులు హాజరుకాకపోగా చెనిగలు తిని చేతులు దులుపుకున్నట్టు హరిత హోటల్ మేనేజర్ ను సమీక్షా సమావేశంకు పూర్తి వివరాలు రాసి పంపించడంతో మంత్రి మీరెవరు అని అడగడంతో పూర్తి తతంగం బయటపడింది.మంత్రి శాఖకు సంబంధించిన అధికారుల జాడే లేకపోవడంతో అక్కడికి వచ్చిన అధికారులంతా చూస్తు విస్తుపోయారు.సమీక్షకు హాజరుకాని అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటారా? లేక చూసి చూడనట్టు వ్యవహరిస్తారా? అనేది వేచి చూడాల్సిందే అంటున్నారు కొంతమంది జిల్లా అధికారులు.

WhatsApp Image 2023 12 12 at 5.47.02 PM

SAKSHITHA NEWS