సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ లో గల శ్రీ శ్రీ శ్రీ తుల్జాభవాని అమ్మ వారి దేవాలయం లో జరిగిన ” తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం ” కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం లో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మతాలను, కులాలను సమానంగా గౌరవిస్తుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషితో ,దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ.అదేవిధంగా సమైక్య పాలనలో ఆదరణ లేక ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు స్వరాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకుంటున్నాయి అని, ముఖ్య మంత్రి కేసీఆర్ కృషితో ఓ వెలుగు వెలుగుతున్నాయి. ప్రజల్లోనూ ఆధ్యాత్మికత వెల్లివిరిస్తున్నది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. అదేవిధంగా స్వరాష్ట్రంలో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్న ఆలయాలు..
సమైక్య రాష్ట్రంలో సరైన పట్టింపు లేక మరుగున పడిన ఆలయాలు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో నేడు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక అయిన యాదగిరిగుట్ట ఆలయాన్ని అడుగడుగునా భక్తి భావం ఉట్టిపడేలా తెలంగాణ ప్రభుత్వం పునర్నిర్మించింది. తెలంగాణలో కొలువై ఉన్న ప్రాచీన దేవాలయాల పునరుద్ధరణ చేపట్టి వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది అని, యాదాద్రి పునర్నిర్మాణంతో పాటు రాష్ట్రంలో ఉన్న బాసర, కొండగట్టు, వేములవాడ, కొలనుపాక తదితర ఆలయాల పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆలయ చైర్మన్ మలికార్జున శర్మ ,బీఆర్ఎస్ పార్టీనాయకులు కృష్ణ యాదవ్, నటరాజు, గోవిందా చారీ,గోపి కృష్ణ, కవిత, నరేందర్ బల్లా,సందీప్ మరియు ,కార్యకర్తలు,వార్డ్ మెంబర్లు,ఏరియా కమిటీ ప్రతినిధులు,ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.