SAKSHITHA NEWS

రాంకీ ఫౌండేషన్ ఉచిత క్యాన్సర్ శిబిరానికి విశేష స్పందన

అనకాపల్లి జిల్లా పరవాడ రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఫార్మసిటీ సహకారంతో తాడి పంచాయతీలో శుక్రవారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ పరీక్షల శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో క్యాన్సర్ అవగాహన, ఉచిత స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరిగినది. కార్యక్రమాన్ని మాజీ మండల అధ్యక్షులు మాదంశెట్టి నీలబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం మాజీ ఎంపీపీ నీలబాబు మాట్లాడుతూ విశాఖపట్నం శివారు గ్రామాలు అభివృద్ధి చెందటంతో పాటు క్యాన్సర్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతుందని దీనిని ముందస్తుగా గుర్తించినప్పుడే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు అని అన్నారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ వైద్య నిపుణురాలు డాక్టర్ ఎన్ సుధానందన్ మాట్లాడుతూ క్యాన్సర్ గుర్తింపు పరీక్షలు చేసుకోవడానికి యువత ముందుకు రావడం లేదని, దీనిపై రాంకీ ఫౌండేషన్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అవగాహన కల్పించడం అభినందించ దగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొడ్డుపల్లి అప్పారావు, స్థానిక నాయకులు జి. అచ్చిబాబు, కోమటి సూరిబాబు, ఎం ఎస్ ఎం ఈ డైరెక్టర్ నదియా పాల్గొన్నారు. తాడి పంచాయితీ నుండి ఈ శిబిరంలో 80 మంది స్త్రీ, పురుషులు పరీక్షలు చేయించుకున్నారు. తమ పంచాయితీ పరిధి లో క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం పట్ల తాడి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download App


SAKSHITHA NEWS