SAKSHITHA NEWS

విద్యతోనే మీ భవిష్యత్తుకు బంగారు బాట

ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

విద్యతోనే మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దామని పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుక్కపట్నం లో ఉన్న బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాన్ని పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యే తో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ , రాష్ట్ర బడ్జెట్లో కూటమి ప్రభుత్వం విద్య కోసం రూ.29 వేల కోట్ల కు పైగా కేటాయించి విద్యార్థుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ,విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పెద్దపీట వేసారని తెలిపారు.అందుకు చంద్రబాబు, నారా లోకేష్ కు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బుక్కపట్నంలో మహాత్మ జ్యోతిబా పూలే బిసి సంక్షేమ బాలికల వసతి పాఠశాలకు ప్రభుత్వం నుంచి తగినంత నిధులు తీసుకొచ్చి వాటిని అతి త్వరగా పూర్తిచేసి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి నూతన గురుకుల పాఠశాలను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న విద్యాసంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు అభ్యసించాలని కోరారు.

*విద్యతోనే మనిషికి తగిన గుర్తింపు :మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి

విధ్య తోనే ప్రతి మనిషికి తగిన గుర్తింపు లభిస్తుందని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యా సంక్షేమాభివృద్ధికి పెద్దపీఠ వేశారని పేర్కొన్నారు. గత వైసిపి ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో గత ప్రభుత్వంలో విద్యార్థుల పెండింగ్ సంక్షేమ బకాయిలు పూర్తిగా చెల్లించేలా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అదే విధంగా బుక్కపట్నం నల్లగుంట్ల పల్లి వద్ద కోటి 50 లక్షలతో బీసీ గురుకుల బాలికల పాఠశాలకు ప్రభుత్వం మంజూరు చేసిందని గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల నిధులు విడుదల చేయలేదని తెలిపారు అది త్వరలో మిగతా నిధులు విడుదల చేసి నూతన గురుకుల బాలికల పాఠశాలను నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు విద్యార్థులు సంక్షేమం కోసం మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు విరాళం అందించిన రూ. 50 వేల రూపాయల విలువచేసే ఫ్యాన్లు ,ప్రజెక్టర్ ,ఇన్వర్తర్ పరికరాలను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా మహాత్మ జ్యోతి బా పూలే బీసీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులకు అందజేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయ సిబ్బంది ఎమ్మెల్యే మాజీ మంత్రి శాలువతో సన్మానించి సత్కరించారు. నూతన పాఠశాల గదులను ,మరుగు దొడ్లు ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి ,పట్టణ కన్వీనర్ రామాంజనేయులు ,మాజీ మున్సిపల్ చైర్మన్ పీసి గంగన్న ,బెస్త చలపతి ,సామకోటి ఆదినారాయణ జయప్రకాష్ ,బేకరీ నాయుడు ,అంబులెన్స్ రమేష్ కూటమి పార్టీల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.