SAKSHITHA NEWS

అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చెల్లి.. !!

ఇల్లు ఖాళీ చేయకుండా సోదరుడు బెదిరింపులు

సోదరుడిపై ఎస్పీకి ఓ చెల్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది.

తెనాలికి చెందిన విజయ తన భర్తతో సింగపూర్‌లో ఉద్యోగం చేసుకునే సమయంలో తన అన్న విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో 2012లో ఇంటిని కొనుగోలు చేశారు.

అప్పటి నుంచి ఆ మూండంతస్తుల ఇంట్లో అద్దెకుంటూ తన అన్న 2019 వరకు అద్దె చెల్లించారని విజయ తెలిపారు.

2021లో లాక్​డౌన్ కారణంగా సింగపూర్‌లో ఉద్యోగం కోల్పోయి అనారోగ్య సమస్యల కారణంగా సొంతింటికి రావడంతో ఖాళీ చేయాలని సోదరుడితో చెప్పామన్నారు. సొంతింట్లో ఉండేందుకు వస్తే గత ఐదు సంవత్సరాలుగా అద్దె చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు ఆరోపించారు. ఇల్లు తక్కువ ధరకు అమ్మేయాలంటూ సోదరుడు ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి జోలికి వస్తే తన భర్తను టిప్పర్​తో ఢీకొట్టి చంపుతానని, పిల్లలపై యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్నట్లు బాధితురాలు తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేశారు.


SAKSHITHA NEWS