పుట్టబోయే బిడ్డల బంగారు భవిష్యత్తుకు పటిష్టమైన పునాదులు

Spread the love

A solid foundation for the golden future of unborn children

పుట్టబోయే బిడ్డల బంగారు భవిష్యత్తుకు పటిష్టమైన పునాదులు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక దవఖాన ఆవరణలో గర్భిణీ స్త్రీలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కెసిఆర్ న్యూట్రిషన్ కిట్స్ లను పంపిణి చేశారు.

ఆహారంతోనే ఆరోగ్యం అనే నినాదం ప్రాతిపదికన గర్భిణి స్త్రీలలో రక్తహీనతను అరిట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించిందని, ఈ కిట్ లో అన్ని రకాల విటమిన్లు, పోషకాలతో కూడిన ఆహరం ఉంటుందన్నారు. పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతులుగా జన్మించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు.

అనంతరం ANM లకు దుస్తుల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page