గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల నుండి గోపన్ పల్లి చౌరస్తా వరకు ప్రధాన రహదారి లో రూ. 100 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా ఏర్పాటు చేసిన రోడ్డు డివైడర్ (విభాగిని) పై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ( విభాగీ వీధి దీపాలను ) కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మరియు మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నల్లగండ్ల నుండి గోపన్ పల్లి చౌరస్తా వరకు రూ.100లక్షల రూపాయల అంచనావ్యయం తో ఏర్పాటు చేసిన రోడ్డు డివైడర్ (విభాగిని) పై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ( విభాగీ వీధి దీపాలను ) ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, వీధి దీపాల ఏర్పాటు ద్వారా రోడ్డు పై వెళ్లే వాహనాలకు చీకటి సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణం సాగేలా విధి దీపాలు దోహదపడతాయి అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. మరియు నల్లగండ్ల నుండి గోపన్ పల్లి చౌరస్తా వరకు ప్రధాన రహదారి కొత్త శోభ వచ్చినది అని ,విధి దీపాల వెలుగులు, ప్రకాశవంతమైన కాంతులు కాలనీ లో విరాజిల్లుతూ నల్లగండ్ల నుండి గోపన్ పల్లి చౌరస్తా వరకు కొత్త శోభను సంతరించుకుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.అదేవిధంగా రాత్రి సమయంలో వాహన దారులకు,పాదచారులకు ఇబ్బందులు కలగకుండా తోడ్పడుతాయి అని,అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని,గచ్చిబౌలి డివిజన్ మరియు నియోజకవర్గ అభివృద్ధికి శాయశేక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్ట్రీట్ లైట్ DE మల్లికార్జున్ గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నం రాజు, జంగయ్య యాదవ్,మంత్రిప్రగడ సత్యనారాయణ, ప్రసాద్,మల్లేష్, వినోద్, శంకరి రాజు ముదిరాజ్, నాగపూరి అశోక్,జగదీశ్, రమేష్ గౌడ్, సురేష్, రమణ రెడ్డి ,ప్రభాకర్ రెడ్డి, రామారావు,ఆకుల యాదగిరి, సల్లావుద్దీన్,అక్బర్,నారాయణ,నర్సింహ రాజు,నవాజ్, శ్రీనివాస్,భిక్షపతి,ఫయాజ్,వెంకటేష్, హాసన్,ఖాదర్ ,రాకేష్, ఖాన్,తాహీర్,ఇందిరా, అరుణ, రాణి, బాలమణి, మాధవి, లత,సుగుణ ,కార్యకర్తలు,వార్డు మెంబర్లు,ఏరియా,కమిటి మెంబర్లు,బూత్ కమిటి మెంబర్లు,కాలనీ వాసులు,కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.