A golden future for our children only if we leave Natu Sara completely
నాటు సారాను పూర్తిగా విడిచి పెడితేనే మన పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించగలం జిల్లా ఎస్పీ.
నాటు సారా విడిచి సమాజంలో ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా జీవించడానికి పలు శాఖలతో కలిసి ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలను కల్పిస్తున్న కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం
కృష్ణాజిల్లా మచిలీపట్నం : ఎన్నో జీవితాలను కాలరాస్తున్న నాటు సారా తయారీ, వినియోగం, అమ్మకాలను జిల్లా నుండి సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ జాషువా ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా SEB అధ్వర్యంలో ఆపరేషన్ పరివర్తన 2.0 ప్రారంభించడం జరిగింది
. ఇందులో భాగంగా నాటు సారా తయారీని విడిచిపెడతామని మా జీవితాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని వారు కోరిన విధంగా పోలీస్ వెల్ఫేర్ కళ్యాణ మండపంలో స్వచ్ఛందంగా నాటు సారా తయారీ విడిచిపెట్టిన కుటుంబాలతో జీవనోపాధి కోసం సంబంధిత శాఖల ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ SEB శ్రీమతి అస్మా ఫర్హీన్ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం నాటు సారాను విడిచి ,సమాజంలో వారికి గౌరవంగా బతికే అవకాశం కల్పిస్తూ, ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించి పోలీస్ స్టేషన్, కేసులు అంటూ వారి జీవితాలను నాశనం చేసుకోకుండా, వారి పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించడమే లక్ష్యం. ఈ కార్యక్రమానికి డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రసాద్ గారు, బందరు డిఎస్పి మాసూం భాష , ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇందులో భాగంగా జిల్లాలో నాటు సారా కాస్తూ అనేక సందర్భాల్లో కేసుల్లో చిక్కుకున్న వారినందరినీ గుర్తించి వారందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి నాటు సారా తయారీ వలన ఎదురయ్యే దుష్పరిణామాలను కులంకశంగా వివరించి సన్మార్గంలోకి నడిపిస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు.
పోలీస్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ పరివర్తన 2.0 కార్యక్రమంలో మచిలీపట్నం సబ్ డివిజన్ పరిధిలో పలు కుటుంబాలను గుర్తించి వారికి డిఆర్డిఏ, డిస్టిక్ ఇండస్ట్రీస్, మెప్మా, డ్వామ, ఫిషరీస్,
ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, శాఖలను మిలితం చేసి వారికి చిన్న, మధ్య తరగతి రుణాలను అందించడం ప్రత్యామ్న్యయ జీవనోపాధి కోసం రుణ సదుపాయం అందించడం, మొదలైన కార్యక్రమాలు, అంతేకాకుండా చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పన కోసం జాబ్ మేళా నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి చర్యలు చేపట్టారు.
నిర్వహించిన కార్యక్రమంలో నాటు సారాను విడిచిన కుటుంబ సభ్యులు వారు జీవనం గడపడానికి ఏ విధమైన రుణసదుపాయం కావాలి, వారెంచుకున్న రంగంలో ఎంతమేర సబ్సిడీ కలిగిన రుణం అందించబడుతుంది, మొదలైన అంశాలను సంబంధిత శాఖ అధికారులు వారికి తెలియజేశారు.
దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వారికి ఏ రంగం ద్వారా రుణ మంజూరుకు అర్హత కలిగినది తెలుసుకుని, వారి వివరాలతో కూడిన అప్లికేషన్ ను అందజేసారు. తద్వారా రుణం పొందిన వారందరికీ చెక్కుల రూపంలో నగదును అందజేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి బ్రతకటానికి గౌరవం అవసరం .అదే గౌరవం లేకుంటే కేసులు చుట్టూ తిరుగుతుంటే సంబంధం బాంధవ్యాలు కోల్పోవడమే కాక మన కుటుంబంలో ఉన్న పిల్లల జీవితం అగమ్యగోచరంగా తయారవుతుంది. మీ అందరికీ సమాజంలో ఒక గౌరవం అందించే ఉద్దేశంతోనే ఈ ప్రత్యామ్నాయ జీవనోపాధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,
పోలీస్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులు అందరూ కలిసి సంయుక్తంగా జిల్లాలో మెరుపు దాడులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మీకు ప్రత్యామ్నాయంగా జీవనోపాధి కల్పించడానికి పలు శాఖలతో మాట్లాడడం జరిగింది. రుణం పొందడానికి అర్హత సాధించిన వారందరికీ త్వరలోనే రుణాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు.