SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 28 at 4.12.44 PM

మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పెట్ లో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పూరషోత్తం , రామప్రభు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత నోట్ పుస్తకాలను కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , హమీద్ పటేల్ , మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు తో కలిసి విద్యార్థులకు అందచేసిన ప్రభుత్వ విప్ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలిచారు అని, ట్రస్ట్ సభ్యులు వారి కుమారులు పూరషోత్తం రామప్రభు ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాము అని, వారి తండ్రి ఆశయాలను కొనసాగించాలని సదుద్దేశ్యం తో ,సమాజ హితం సమాజం కోసం తమకు తోచిన విధంగా సహాయం చేయాలనే ఉద్ధేశ్యం తో పుస్తకాలను పంపిణీ చేయడం చాలా అభినదించదగ్గ విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు. విద్యార్థులు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని, జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఏర్పరచుకొని సాధించే వరకు కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేయాలని , క్రమశిక్షణ తో కూడిన విద్య ద్వారా ఉన్నత పౌరులుగా ఎదుగుతారు అని తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని ,మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత తో మొక్కలు నాటి సంరక్షించాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS