తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన శ్రావణమాసం బోనాల పర్వదినం

Spread the love

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన శ్రావణమాసం బోనాల పర్వదినం సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి విలేజ్, బాపు నగర్,గోపి నగర్ కాలనీలలో నిర్వహించిన బోనాల వేడుకలలో మరియు ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ఫలహారం బండి ఊరేగింపుని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా ప్రజలందరికి బోనాల పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని, అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నాను అని, ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలో బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవలనే ఉద్దేశ్యం తో నియోజకవర్గం లోని ప్రతి గుడికి బోనాల నిధులు మంజూరయేలా కృషి చేశానని ,బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకునేల  బోనాలు నిర్వహించుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేయడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాని, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాల వారు అంగరంగా వైభవంగ పండుగల జరుపుకునేల కృషి చేస్తున్నారు అని , ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి కెసిఆర్  ముందుకు తీసుకెలుతున్నారని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు.

బోనాల సందర్భంగా ప్రతి గుడి వద్ద అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండ అన్ని రకాల వసతులు కలిపిస్తూ ప్రశాంత వాతావరణం కలిపించమని, బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగేల అన్ని ఏర్పాట్లను చేశామని, బోనాల పండుగ మంచి ప్రశాంత వాతావరణంలో జరిగినవి అని ప్రభుత్వ విప్ గాంధీ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు,శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘనాథ్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పొడుగు రాంబాబు, పద్మారావు, కృష్ణ యాదవ్, ప్రసాద్,మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్,రామరాజు, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, నటరాజు, పవన్, రవి యాదవ్, రేవంత్, నర్సింహ రెడ్డి, జమ్మయ్య, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page