సాక్షిత : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా శేర్లింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ లో గల అంబేద్కర్ మరియు జగ్జీవన్ రావ్ విగ్రహాలకు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన భారత రాజ్యాంగానికి ప్రధాన రూపశిల్పి, స్వతంత్య్ర భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, దేశంలోనే ప్రముఖ న్యాయనిపుణుడిగా, ఆర్థికవేత్తగా, సంఘ సంస్కర్తగా అంబేడ్కర్ ఎంతో ప్రసిద్ధిగాంచారు అన్నారు.
అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయం వద్ద ప్రపంచంలో కెల్లా ఎతైన 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, విశ్వ విజ్ఞాన మూర్తికి నివాళులు అర్పించడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణగౌడ్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, అధ్యక్షులు అనిల్ రెడ్డి, ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షులు జాన్, మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు కృష్ణారావు, షౌకత్ అలీ మున్నా, అగ్రవాసు, బాలస్వామి, యాదగిరి, పుట్టం దేవి, మౌలానా, జగదీష్, రవీందర్, మహేష్, పద్మయ్య, తదితరులు పాల్గొన్నారు.