SAKSHITHA NEWS

బీసీ బంధు నిరంతర ప్రక్రియ
295 మంది బీసీ బంధు లబ్ధిదారులకు 2 కోట్ల 95 లక్షల విలువ గల చెక్కుల పంపిణీ
ఆందోళన అవసరం లేదు ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సహాయం అందుతుంది.

హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

సాక్షిత – సిద్దిపేట బ్యూరో :
దేశంలోని మొట్టమొదటిసారిగా బీసీల ఆర్థిక స్వావలంబన, కులవృత్తుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బందు పథకం ప్రవేశపెట్టారని, ఎంపికైన ప్రతి లబ్ధిదారునికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నామని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గంలోని హుస్నాబాద్ మున్సిపల్ మరియు హుస్నాబాద్ మండలం, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలకు చెందిన 295 మంది లబ్ధిదారులకు బీసీ బందు పథకం ద్వారా మంజూరైన రూ.2 కోట్ల 95 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 7232 మంది బిసి బంధు కు అప్లై చేసుకోగా 6022 మందిని లబ్ధిదారులుగా గుర్తించామని 295 చెక్కులు పంపిణీ చేస్తున్నామని ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ఎవరు ఆందోళన పడవలసిన పని లేదు అర్హులైన ప్రతి ఒక్కరికి బీసీ బంధు అందుతుందని అన్నారు. అక్కన్నపేట మండలం 39, హుస్నాబాద్ మండలం 30, హుస్నాబాద్ మున్సిపాలిటీ 33, కోహెడ 44, చిగురుమామిడి 33, సైదాపూర్ 43, భీమదేవరపల్లి 36, ఎల్కతుర్తి 35, వేలేరు మండలం 2 బీసీ బంధు చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పదివేల రూపాయల రుణం కోసం బ్యాంకుల చుట్టూ పడిగాపులు కాస్తూ, గ్యారంటీల కోసం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండేవన్నారు. నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మొట్టమొదటిసారి కుల వృత్తుల అభివృద్ధి కోసం ఎలాంటి హామీ లేకుండా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.

ప్రతి పైసా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని అభిలాషించారు. ప్రజలందరూ వారు అర్హులైన పథకాలకు కచ్చితంగా లబ్ధి పొందుతారని ఇందులో తన పర బేధం కేసీఆర్ ప్రభుత్వం చూపించదని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు.రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులకు చేయూతనిచ్చే ఆలోచనతో బిసి బంధు ద్వారా ఒక లక్ష రూపాయలు సహాయం చేస్తుందని, ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులు మరుగున పడిపోయాయని కానీ సీఎం కేసీఆర్ కులవృత్తులకు మళ్లీ జీవం పోసారని గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ, ముదిరాజు సోదరులకు చెరువులలో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను వదులుతుందని అలాగే చెరువులపై వాళ్లకు హక్కులు కల్పించామని, దళిత బంధు, బీసీ బంధు, రైతులకు రైతు బీమా, రైతు బంధు, రుణమాఫీ వివిధ సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా అద్భుతంగా పరిపాలన సాగిస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు.

దేశంలోనే మొట్టమొదటి సారిగా సబ్బండ వర్గాల సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని తెలిపారు. బీసీ బందు పథకం కుల వృత్తుల పరిరక్షణలో నూతన శకానికి శ్రీకారం చుట్టబోతోందని తెలిపారు. ప్రభుత్వం అందించిన ప్రతి పైసాను రెట్టింపు చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు.హుస్నాబాద్ నియోజకవర్గం సంక్షేమ,అభివృద్ధిలో అన్ని రంగాలలో ముందు నిలుస్తోందని తెలిపారు.


SAKSHITHA NEWS