SAKSHITHA NEWS

శ్రీనివాససేతు పనులను పరిశీలించిన మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్


*సాక్షిత : *తిరుపతి శ్రీనివాస సేతు తుది దశ పనులను వేగవంతం చేయాలని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి బస్టాండ్ వద్ద రైల్వే వంతెనపై జరుగుతున్న పనులను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల గురించి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డికి కమిషనర్ హరిత వివరిస్తూ రైల్వే వంతెనపై ఇప్పటికే అతి కిలకమైన ఆరు గెడ్డెర్లను అమర్చడం జరిగిందని, ఆ గెడ్డెర్లపై డెక్ స్లాబ్ పనులు జరుగుతున్నాయని, ఆ తరువాత బిటి రోడ్డు వేయడంతో పనులు పూర్తి అవుతాయని వివరించారు. ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ ఇప్పటికే మూడు దశలుగా శ్రీనివాస సేతును ప్రారంభించడం జరిగిందని, ఈ నాల్గవ దశ పూర్తి అయితే శ్రీనివాస సేతు మొత్తం పూర్తి అయినట్లెనని చెబుతూ, ఈ నెలఖారకి పనులు మొత్తం పూర్తి అవ్వల్సిందేనని పనులు చేపట్టిన ఆఫ్కాన్ సంస్థ ప్రతినిధి రంగస్వామికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొదట తిరుచానూరు మ్యాంగో మండి వద్ద నుండి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పై ప్రయాణించి, కీలక దశ పనులు జరుగుతున్న రైల్వే వంతెన పై భాగానికి వచ్చి ఎమ్మెల్యే భూమన, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ పనులను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS