SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 15 at 5.22.48 PM

పేద విద్యార్థులకు 2 లక్షల విలువైన బ్యాగులు, పుస్తకాలు వితరణ
— మానవత్వం చాటుకున్న బొడ్డు సత్యనారాయణ
— బొడ్డు సత్యనారాయణను సన్మానించిన ఎంఈఓ, ఉపాద్యాయులు, గ్రామస్తులు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

చదువు ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని బొడ్డు సత్యనారాయణ అన్నారు. రఘునాధపాలెం మండలం దానవాయిగూడెం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి లకు చెందిన 170 మంది విద్యార్థులకు రెండు లక్షల రూపాయల విలువగల స్కూల్ బ్యాగులు, నోటు పుస్తకాలు, టై, బెల్టులు, పలకలను అదే గ్రామానికి చెందిన బొడ్డు సత్యనారాయణ వితరణగా అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బొడ్డు సత్యనారాయణ మాట్లాడుతూ.. జీవితాలను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని విద్యార్థులందరూ బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలకు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బొడ్డు సత్యనారాయణను ఎంఈఓ ఎం శ్రీనివాసరావు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా టీవీ రమణ తన తండ్రి జంగయ్య జ్ఞాపకార్థం స్మార్ట్ టీవీని, దోమల రవి సౌండ్ సిస్టంను, టీచర్ వెంకటలక్ష్మి తన తండ్రి జ్ఞాపకార్థం ప్రింటర్ ను పాఠశాలకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లలిత రాణి, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ నాగమణి, మండల విద్యాశాఖాధికారి ఎం శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేంద్రమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS