SAKSHITHA NEWS

పలు దొంగతనాలకు పాల్పడుతున్న యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు

బంగారం, వెండి, కత్తులు, గ్యాస్ సిలిండర్లు స్వాధీనం

చిట్యాల సాక్షిత ప్రతినిధి

పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను మంగళవారం పోలీసుల అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చిట్యాల పోలీస్ స్టేషన్లో సీఐ శివరాం రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దొంగతనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం పెద్దకాపర్తి గ్రామంలో పొట్లపల్లి శ్రీధర్ గౌడ్ ఇంట్లో బంగారం వెండి 35 వేల రూపాయల నగదు రెండు గ్యాస్ సిలిండర్లు వంట సామాగ్రిని దొంగిలించుకుని పారిపోయారని కేసు నమోదు చేసుకొని విచారణ చేయగా మహమ్మద్ అబ్రారుద్దీన్(22), షేక్ ఇర్ఫాన్ (27)అనే ఇద్దరు యువకులు పలు దొంగతనాలు చేస్తూ బుధవారం నాడు పట్టుబడ్డారని మీరు గతంలో దొంగతనాలకు అలవాటు పడి నేరస్తులుగా నిర్ధారించి వారి కదలికలపై నిలబెట్టడం జరిగిందని అన్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ మోతీ నగర్ వద్ద ఉన్నారని సమాచారంతో సిసిఎస్ పోలీసులు, నార్కట్పల్లి సీఐ శివరాం రెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి ఇరువురిని అరెస్టు చేయడం జరిగింది. పెద్దకాపర్థి గ్రామంలో దొంగతనం చేసింది కూడా వీరే అని నిర్ధారణ చేయడం జరిగింది.గతంలో వివిధ పోలీస్ స్టేషన్లో ఇరువురి పై 20 కి పైగా కేసులున్నాయి. గతంలో పిడి ఆక్ట్ కింద సంవత్సరము జైలు శిక్ష అనుభవించి వచ్చినారని రాత్రి వేళలో తాళం వేసి ఇళ్లలో తాళం పగలగొట్టి బంగారం మరియు వెండి ఇతర వస్తువులను నిందించుకొని పోయి వాటిని తక్కువ ధరకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలకు పాల్పడేవారు. వీరి వద్ద నుండి ఐదున్నర తులాల బంగారము,ఆరున్నర తులాల వెండి ఒక టీవీ రెండు గ్యాస్ సిలిండర్లు గ్యాస్ స్టవ్ వంట సామాగ్రి, రెండు కత్తులు రెండు ఫోన్లు స్వాధీన పరచుకోవడం జరిగింది అని తెలిపారు. వీరిపై పని సెక్షన్లపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కేసును చాకచక్యంగా చేదించిన సీఐ శివరాం రెడ్డి, చిట్యాల ఎస్ఐ ఇరుగు రవి కుమార్, సిసిఎస్ జితేందర్ రెడ్డి ఎస్సై అజయ్, ఏ ఎస్ ఐ కృష్ణ హెడ్ కానిస్టేబుల్ విష్ణు మరియు పోలీస్ సిబ్బంది ని డి.ఎస్.పి నరసింహారెడ్డి అభినందించారు.


SAKSHITHA NEWS