SAKSHITHA NEWS

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు దేశంలో ఎక్కడా లేని విధంగా కృషి చేస్తున్నారని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారన్నారు.కాల్వ శ్రీరాంపూర్ మండలంలోనీ పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పలుఅభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ముందుగా గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి స్థానిక ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.

కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామంలో MGNREGS &SDF నిధులు 70 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన సీసీ రోడ్లను, లక్ష్మీ పురం గ్రామంలో రూ 30 లక్షల MGNREGS నిధుల తో నిర్మాణం చేసిన అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. అదేవిధంగా పెద్దంపేట గ్రామంలో CDP నిధులు 5 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టే యాదవ సంఘం కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలను గ్రామ పంచాయితీలకు మంజూరు చేస్తున్నారన్నారు.గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, మౌళిక వసతుల రూపకల్పనకు కృషి చేస్తూ ముందుకుపోతున్నారన్నారు,దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి పథకాలను ప్రవేశ పెట్టి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగానిలుస్తుందన్నారు.కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మునుపెన్నడూ లేని విధంగా సీసీ రోడ్లు, మురికి కాలువలు, గ్రామాల అంతర్గత రహదారులు, మహిళా భవనాలు, కమ్యూనిటీ భవనాలు నిర్మించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానన్నారు. గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజలంతా అండగా ఉండాలన్నారు. గ్రామ పురోహితులు నిట్టూరి అంబరీష్ శర్మ, నిట్టూరి సతీష్ శర్మ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్ ,జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, సింగిల్ విండో ఛైర్మెన్ గజవెల్లి పురుషోత్తం, మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజ కొమురయ్య,రైతుబంధు మండల కో ఆర్డినేటర్ నిదానపురం దేవయ్య ,మాజీ మార్కెట్ ఛైర్మెన్ రామచంద్రారెడ్డి,సర్పంచ్ లు కొంకటి మల్లారెడ్డి, బండ రవీందర్ రెడ్డి, ఓదెల రవి,ఎంపీటీసీ మానస-సతీష్, మంద వెంకన్న, గోనే శ్యామ్,బుర్ర సదానందం,ఎంపీటీసీ బొల్లమల్ల శంకర్, ఉప సర్పంచ్ మేడి తిరుపతి, బోయిని చందర్,స్వప్న-రాజేందర్,PACS డైరెక్టర్ లు ముస్కు శ్రీనివాస్, ముస్కు తిరుపతి,మాజీ సర్పంచ్ జక్కే రవి, ఆయా గ్రామాల నాయకులు జక్కుల మోహన్,తాత రాజు, ఈర్ల శ్రీనివాస్, అనుముల చంద్రయ్య, నరెడ్ల సదయ్య , గురిజాల గణపతి రెడ్డి, రాణవేన మహేందర్, ఎండి హుస్సేన్, ఆవుల తిరుపతి, మేడి దేవేందర్, బండ మల్లారెడ్డి,కూకట్ల నవీన్,దేవేందర్ రెడ్డి, వీరేశం,లక్ష్మయ్య,యుగేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లింగయ్య, కమలమ్మ,మల్లారెడ్డి,దామ శారద, లావణ్య, మానస,దాసరి తిరుపతి, చంద్రశేఖర్,రాజయ్య, రాజ్ కుమార్, కల్పన-మోహన్, మహేష్,బోయిని రాజు, ఆయా గ్రామాలసర్పంచులు, ఎంపీటీసీలు,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS