తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘విద్యా దినోత్సవం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి .
నేడు తెలంగాణ విద్యా దినోత్సవం..
వీపనగండ్ల మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తెలంగాణ విద్యా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని 42.15 లక్షలతో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మౌలిక వసతుల రూపకల్పన చేసి పాఠశాలను ప్రారంభించారు.
51.74 లక్షలతో నూతనంగా నిర్మించే పాఠశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
అనంతరం కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో 27.70 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే గారు ప్రారంభించారు.
అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,బట్టలు (దుస్తువులు) పంపిణీ చేసి పిల్లలకు రాగిజావా అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ప్రగతి బాటలో ముందుకు సాగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ, కొత్తగా గురుకుల పాఠశాలలను నెలకొల్పుతూ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యారంగాన్ని తలదన్నేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు,బిఆర్ఎస్ నాయకులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.