SAKSHITHA NEWS

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగిన ” తెలంగాణ విద్యా దినోత్సవం ” కార్యక్రమంలో డీసీ వెంకన్న , MEO వెంకటయ్య , కార్పొరేటర్లు హమీద్ పటేల్ , జగదీశ్వర్ గౌడ్ , మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థిని, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ,స్కూల్ యూనిఫామ్ లను అందచేసి రాగి జావా ను ప్రారంభించి ప్రసంగించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాయదుర్గం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో “విద్యా దినోత్సవం” జరుపుకోవడం చాలా సంతోషకరమని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న ‘మన ఊరు-మన బడి’ – ‘మన బస్తి-మన బడి’ కార్యక్రమంతో సర్కారు బడులు కొత్తరూపు సంతరించుకున్నాయి అని, సకల హంగులతో సర్వాంగ సుందరంగా తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు, సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాటి రూపురేఖలే మరినాయి అని, తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి అని దేశంలోకెల్లా అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని పేర్కొన్నారు. అదేవిధంగా 1,002 గురుకుల పాఠశాలల్లో 5,99,537 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతున్నదని, ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి 1 లక్షా 25 వేల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం వెచ్చిస్తున్నదని సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు మన ఊరు-మన బడి, మన బస్తి – మన బడి కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాటి రూపురేఖలే మార్చేస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో “ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం”తో పేద విద్యార్థుల విదేశీ విద్య కల సాకారం అయ్యిందని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.విద్యతోనే వికాసం,విద్యతోనే ఆత్మవిశ్వాసం,ప్రతి తరగతి గది, తరగని విజ్ఞాన గని
ఆ నాలుగుగోడలే.. దేశ భవిష్యత్తుకు మూలస్తంభాలు.ఈ సిద్ధాంతాన్ని నమ్మడమే కాదు..
అక్షరాలా ఆచరించింది తెలంగాణ ప్రభుత్వం..
తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానంలో సరికొత్త విద్యా విప్లవం
యావత్ దేశానికే పాఠాలు నేర్పుతోంది తెలంగాణ ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.
మిగతా రాష్ట్రాల్లో డ్రాప్-అవుట్ లు..
తెలంగాణలో మాత్రం డ్రాప్-ఇన్ లు.కేవలం ఒక్క ఏడాదే..
ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల వైపు..కొత్తగా లక్షకు పైగా విద్యార్థుల బలమైన అడుగులు,వ్యవసాయంలోనే కాదు..
విద్యారంగంలోనూ వలసలు వాపస్
రేపటి పౌరుల భవిష్యత్తుపైనే ప్రభుత్వ ఫోకస్ దేశ చరిత్రలోనే అత్యధిక గురుకులాలు
కార్పొరేట్ స్థాయి ప్రమాణాలకు చిరునామాలు,ఒక్కో విద్యార్థిపై రూ.లక్షా 25 వేల వ్యయం
భారంగా కాదు.. బాధ్యతగా భావిస్తోంది మన ప్రభుత్వం.మన ఊరు-మన బడితో సమూల మార్పులు
26 వేల పాఠశాలలకు సరికొత్త రూపురేఖలు ,సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనమైనా..
సర్కారు బడిలో ఇంగ్లీష్ మీడియం బోధనైనా..
ప్రతి ఆలోచన విప్లవాత్మకం..
ప్రతి నిర్ణయం ప్రతిష్ఠాత్మకం..
మన భావితరాలకు బంగారు బాటలేసే..
ఈ మహాయజ్ఞంలో మేముసైతం అంటూ…
మనసుపెట్టి పనిచేస్తున్న ఉపాధ్యాయులకు
క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు
సేవలు అందిస్తున్న ఉద్యోగులకు
యావత్ అధికార యంత్రాంగానికి..
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా
హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫారాలు అందజేస్తున్నామని. అదేవిధంగా 1 వ తరగతి నుండి 5 తరగతి వరకు విద్యార్థులకు ఉచిత వర్క్‌షీట్‌లు,పుస్తకాలు మరియు 6 వ తరగతి నుండి 10 తరగతి విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్‌లు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ లు పంపిణీ చేయడం జరిగిందని. అదేవిధంగా ఇటీవల ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యతమ ప్రతిభ చూపిన పాఠశాల టాపర్‌లను , ఉత్తమ ప్రధానోపాధ్యాయులు , ఉత్తమ ఉపాధ్యాయులు, ఐదుగురు ఉత్తమ తల్లిదండ్రులు, ఉత్తమ పాఠశాల నిర్వహణ కమిటీలను ప్రభుత్వ విప్ గాంధీ చేతుల మీదుగా శాలువాతో సత్కరించించి వారికీ బహుమతులను అందజేయడం జరిగింది. అదేవిధంగా వారంలో 3 రోజులు అల్పారంగా ఉదయం రాగి జావా ను అందచేయడం జరుగుతుంది అని, విద్యార్థులకు డిక్షనరీలను అందచేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ,ఉపాధ్యాయులు,విద్యార్థులు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీనాయకులు ,కార్యకర్తలు,వార్డ్ మెంబర్లు,ఏరియా కమిటీ ప్రతినిధులు,ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS