సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి మెయిన్ రోడ్డులో ఎస్.ఎన్.డి.పి ఆధ్వర్యంలో రూ.8.45 కోట్లతో చేపడుతున్న కల్వర్టు మరియు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ , మైనంపల్లి హనుమంత రావు స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ మరియు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు హెచ్ఎండిఏ చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులకు అనుగుణంగా కల్వర్టు నిర్మాణ పనులను పెంచాలని, అందుకు నిధులు అవసరమైతే కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. 40% పనులు పూర్తి కావడంతో మిగిలి ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ నారాయణ, డిఈ నరేందర్, ఏఈ లక్ష్మీ నారాయణ, స్థానిక వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, పాక్స్ చైర్మన్ నరేందర్ రాజు మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దూలపల్లి కల్వర్టు, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యేలు…
Related Posts
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం
SAKSHITHA NEWS శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా 5 మంది లబ్ధిదారులకు (CMRF) ద్వారా మంజూరైన 2,09,000/- రెండు లక్షల తొమ్మిది వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన…
శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయానికి రాపోలు నీలావతి రూ. 12 లక్షల విరాళం
SAKSHITHA NEWS శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయానికి రాపోలు నీలావతి రూ. 12 లక్షల విరాళం శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయానికి శుక్రవారం రాపోలు నీలావతి…