SAKSHITHA NEWS

గుమ్మడిదలలో ఘనంగా ఊరురా చెరువుల పండుగ
గుమ్మడిదల : గత ప్రభుత్వాల హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన చెరువుల పునరుద్ధరణ కోసం. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం చిన్న నీటిపారుదల రంగంలో విప్లవాలు సృష్టించిందని, దేశానికి ఆదర్శంగా నిలిచిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు


తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజైనా మండల కేంద్రమైన గుమ్మడిదల ఎర్ర చెరువు కట్టపై నిర్వహించిన ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ పథకం ద్వారా ప్రతి చెరువులో పూడికతీత పనులు చేపట్టి జలకళ తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. రైతులతో పాటు మత్స్యకారుల సంక్షేమం కోసం చెరువులలో చేపలు పెంచేందుకు ఉచితంగా చేప పిల్లల్ని పంపిణీ చేసి వారి ఆర్థిక అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. రాష్ట్రంలో నిర్దేశించిన లక్ష్యానికి మించి వ్యవసాయ ఉత్పత్తులు పండుతున్నాయని తెలిపారు. ప్రతి రైతు గర్వంగా తలెత్తుకొని జీవించే పరిస్థితులు ఏర్పరిచారని అన్నారు. అనంతరం చెరువు కట్టపై గల కట్ట మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసి కుమార్ గౌడ్, గ్రామ సర్పంచ్ నరసింహ రెడ్డి, వైస్ ఎంపీపీ మంజుల వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 06 08 at 5.04.19 PM

SAKSHITHA NEWS