SAKSHITHA NEWS

ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు
చిట్యాల సాక్షిత

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ రైతు వేదికలొ నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎంపిపి కొలను సునీత వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బందు, రైతు భీమా, 24గంటల ఉచిత విద్యుత్, సకాలంలో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించడంతో పాటు పండించిన దాన్యాన్ని రైతుల కల్లాల వద్దే మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు వ్యవసాయం దండగా అన్న నానుడిని నేడు పండుగ చెసిన రైతు బంధావుడు సీఎం కేసీఆర్ ని పేర్కొన్నారు. నా తెలంగాణ కోటి రత్నాల వీన అన్న మాటలను నిజం చేస్తూ నేడు రాష్ట్రంలో 2కోట్ల ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సుంకేనపల్లి ఉపసర్పంచ్ రవీందర్, పశు వైద్యాధికారి అమరేందర్, వ్యవసాయ అధికారి (ఎఈఓ)
వీణా కుమారి, మాజీ సర్పంచ్ రాచకొండ కృష్ణయ్య, పీఏసీఎస్ డైరెక్టర్లు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 06 03 at 5.47.55 PM

SAKSHITHA NEWS